గాంధీ భవన్‌ ఎదుట ధర్నాకు బీజేపీ యత్నం

18 Dec, 2018 14:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రఫెల్‌ డీల్‌పై సుప్రీం కోర్టు తీర్పును గౌరవించాలని కోరుతూ తెలంగాణ బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. అందులో భాగంగా బీజేపీ నేతలు మంగళవారం గాంధీ భవన్‌ ముందు ధర్నా చేసేందుకు యత్నించారు. రఫెల్‌ యుద్ద విమానాల కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ధర్నాకు యత్నించారు. ఈ విషయంలో రాహుల్‌ ప్రధాని నరేంద్ర మోదీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అందులో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి గాంధీ భవన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ సీనియర్‌ నాయకులు రామచంద్ర రావు, రాజాసింగ్‌, కిషన్‌ రెడ్డితోపాటు  కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీని నాయకులను అరెస్ట్‌ చేసిన పోలీసులు వేర్వేరు పోలీస్‌ స్టేషన్‌లకు తరలించారు.

కాగా, దేశ రక్షణను పక్కకు పెట్టి రఫెల్‌ డీల్‌పై కాంగ్రెస్‌ నీచమైన రాజకీయాలకు పాల్పడుతుందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. రఫెల్‌ డీల్‌లోని వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లెందుకు తమ పార్టీ చర్యలు చేపట్టిందని వారు తెలిపారు.

మరిన్ని వార్తలు