ఏపీ: దూకుడు పెంచిన బీజేపీ

8 Mar, 2018 16:34 IST|Sakshi
మంగళగిరిలో బీజేపీ నాయకులు

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నాయకులు దూకుడు పెంచారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని టీడీపీ సర్కారు చేస్తున్న ఎదురుదాడిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు కమలనాథులు రంగంలోకి దిగారు. చంద్రబాబు కేబినెట్‌ నుంచి వైదొలగిన వెంటనే బీజేపీ నాయకులు ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టారు. దీనిలో భాగంగా గురువారం మంగళగిరిలోని ఎయిమ్స్ నిర్మాణ పనులను బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వయంగా పరిశీలించారు. టీబీ సానిటోరియం ప్రాంతంలో నిర్మిస్తున్న ఎయిమ్స్ నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయో చూశారు.

బీజేపీ నాయకులు కామినేని శ్రీనివాస్‌, పైడికొండల మాణిక్యాలరావు, సోము వీర్రాజు, పీవీఎన్‌ మాధవ్‌ తదితర నాయకులు ఎయిమ్స్ భవన నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ఏపీని కేంద్రం పట్టించుకోవడం లేదన్న టీడీపీ ఆరోపణల్లో వాస్తవం లేదని, ఎయిమ్స్‌ నిర్మాణ పనులే ఇందుకు నిదర్శమని అన్నారు.

కాగా, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నుంచి టీడీపీ మంత్రులు వైదొలగాలని నిర్ణయించడంతో.. చంద్రబాబు కేబినెట్‌లోని ఇద్దరు బీజేపీ మంత్రులు ఈరోజు రాజీనామా చేశారు.

మరిన్ని వార్తలు