ప్రధాని మోదీ ప్రచారం చేసినా...

19 Dec, 2018 19:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెల్సిందే. అయితే ఆయన ఎన్నికల ప్రచారం చేసిన ప్రాంతాల పరిధిలో 70 శాతం నియోజక వర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయిందని ‘ఇండియాస్పెండ్‌’ విశ్లేషణ స్పష్టం చేస్తోంది. 80 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని 30 చోట్ల మోదీ బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. వాటిల్లో 23 సీట్లను బీజేపీ గెలుచుకోగా, 57 సీట్లలో ఓడిపోయింది.

మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో 54 నియోజకవర్గాల పరిధిలో 22 ఎన్నికల ర్యాలీలు (అంటే 70 శాతానికిపైగా) ప్రధాని మోదీ ర్యాలీలు నిర్వహించగా, 22 సీట్లను (41 శాతం) గెలుచుకోగలిగింది. ఇక చత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లోని 26 నియోజక వర్గాల పరిధిలో మోదీ ఎనిమిది ర్యాలీలు నిర్వహించగా, ఒకే ఒక్క సీటును బీజేపీ గెలుచుకుంది. మిజోరం మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్, యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ యోగి 58 ర్యాలీలు నిర్వహించగా, బీజేపీ 27 సీట్లను గెలుచుకుంది. 42 సీట్లను కోల్పోయిందని ఇండియాస్పెండ్‌ విశ్లేషించింది. ఈ విషయంలో మోదీ కన్నా యోగి పర్యటించిన ప్రాంతాల్లోనే బీజేపీ కాస్త ఎక్కువ విజయం సాధించింది.

మోదీ పర్యటించిన ప్రాంతాల్లో బీజేపీ 28.75 స్థానాల్లో, యోగి పర్యటించిన ప్రాంతాల్లో బీజేపీ 39.3 శాతం విజయం సాధించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో యోగి 27 బహిరంగ సభలు నిర్వహించగా, 37 స్థానాలకుగాను 21 స్థానాల్లో బీజేపి విజయం సాధించింది. ఇక చత్తీస్‌గఢ్‌లో యోగి 23 ర్యాలీలు నిర్వహించగా, బీజేపీ కేవలం ఐదు సీట్లను గెలుచుకుంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బ్యాలెట్లలో పొరపాట్లు.. మారిన తలరాతలు 

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

‘చంద్రబాబు ఏపీ పరువు తీస్తున్నారు’

మోదీకి కేరళలో పోటీ చేసే దమ్ముందా?

వైఎస్సార్‌సీపీకే మద్దతు

నామినేషన్‌ వేయబోతే జైలుకు పంపారు!

బయటకెళ్తే భయమేస్తోందమ్మా

మన్మోహన్‌ కన్నా మోదీనే మేలు : షీలా దీక్షిత్‌

‘ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రూ.100 కోట్ల ఆఫర్‌’

ఆ మంత్రులంతా కోటీశ్వరులే!

మభ్యపెట్టి విజయం సాధించారు

మంత్రివర్గ విస్తరణ.. ఇద్దరు మహిళలకు చోటు

కాంగ్రెస్‌కు దాసోహమంటారా?

రాక్షస పాలన తప్ప ఇంకేమీ ఇవ్వలేదు: వైఎస్‌ జగన్‌

‘ఎర్రబెల్లి కోసం జూపల్లిని ఓడగొట్టారు’

ఎమ్మెల్సీ పదవికి కొండా మురళి రాజీనామా

హస్తానికి గులాబీ దెబ్బ

మండలిపై టీఆర్‌ఎస్‌ నజర్‌

పంచాయతీల్లో ఎవరికెన్ని రిజర్వేషన్లు

తప్పుడు సర్వేలను  పాతరేశారు: ఈటల

ప్రజలు మనవైపే

సీఎల్పీ రేసులో శ్రీధర్‌బాబు?

తండ్రిని వెనకేసుకొచ్చిన ఎంపీ కవిత

‘చారాణ చేశా.. బారాణ చేయాల్సి ఉంది’

రాత్రికి రాత్రే ఓటింగ్‌ శాతం ఎలా పెరిగింది?

నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువే: హరీష్‌