కపిల్‌దేవ్‌కు ఎంపీ పదవి?

27 Jun, 2018 15:47 IST|Sakshi
కపిల్‌తో అమిత్‌ షా (పాత ఫొటో)

న్యూఢిల్లీ : మరో లెజండరీ క్రికెటర్‌ రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. ఈ ఏడాది వర్షాకాలపు పార్లమెంటు సమావేశాల్లో(జులై 18 నుంచి ఆగష్టు 10) కపిల్‌ దేవ్‌ను రాజ్యసభ సభ్యుడిగా నామినేట్‌ చేసేందుకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించినట్లు ఓ ఆంగ్ల దినపత్రిక కథనాన్ని ప్రచురించింది.

రాష్ట్రపతి ఎంపిక చేసే రాజ్యసభ సభ్యులు కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అభిప్రాయానికి అనుగుణంగా ఉండటం సంప్రదాయం. ఈ నేపథ్యంలో కపిల్ దేవ్‌ను పెద్దల సభకు పంపాలని బీజేపీ భావిస్తున్నట్టుగా ఆ పత్రిక కథనంలో పేర్కొంది. కపిల్‌తో పాటు బాలీవుడ్‌ నటి మాధురి దీక్షిత్‌ను సైతం రాజ్యసభకు నామినేట్‌ చేయాలనే యోచనలో మోదీ సర్కారు ఉన్నట్లు తెలిపింది.

ఇటీవలే బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కపిల్ దేవ్ ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ ఇంటికి కూడా వెళ్లిన అమిత్‌ షా సమావేశం అయ్యారు. కాగా, ఇటీవలే సచిన్‌ టెండూల్కర్‌ రాజ్యసభ సభ్యత్వం కాలం ముగిసిన విషయం తెలిసిందే. అయితే, పదవీ కాలంలో సచిన్‌ పనితీరుపై తీవ్రంగా విమర్శలు రావడంతో ఆయన తనకు వచ్చిన వేతనాన్ని అంతటిని తిరిగి ఇచ్చేశారు.

మరిన్ని వార్తలు