చరిత్ర మాట్లాడితే నగర బహిష్కరణా?

15 Jul, 2018 16:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రం ప్రభుత్వం పౌర హక్కులను కాలరాస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ ఆరోపించారు. రాజకీయ నాయకులు, ఇతర సంఘాలు నిరసన, ధర్నా చేసే హక్కు లేకుండా చేస్తోందని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వామి పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

చరిత్ర గురించి మాట్లాడితే స్వామీజీని నగర బహిష్కరణ చేస్తారా అని ప్రశ్నించారు. పోలీసులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. శనివారం ర్యాలీ చేస్తామంటే తనను గృహనిర్బంధం చేశారని మండిపడ్డారు. రెచ్చ గొట్టే వాఖ్యలు చేసే వారిని ఎందుకు అరెస్ట్‌ చేయడంలేదని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకుల్లో ఆరుగురిపై కేసులున్నాయని దమ్ముంటే వారిని అరెస్ట్‌ చేయాలని సవాల్‌ చేశారు.

ఎంఐఎం నాయకులు రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తే వారిని పట్టించుకోకుండా వదిలేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అపాయిట్‌మెంట్‌ తీసుకొని వివరిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి అనుమతి ఇవ్వకుంటే అక్కడే ఉండి అనుమతి తీసుకుని వివరిస్తామని ఎమ్మెల్యే ప్రభాకర్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు