తెలంగాణ కాబినెట్‌ గొర్రెల మంద: ఎంపీ అరవింద్‌

3 Jun, 2020 18:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కుటుంబ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి ఆరేళ్లు పుర్తయ్యాయని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సీ ఓటర్‌ సర్వేలో ప్రథమ స్థానంలో వచ్చిన ఓరిస్సా ముఖ్యమంత్రికి ఆయన శుభకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంచి మార్కులు వచ్చాయన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అంధకార పాలనతో 16వ స్థానంలో ఉన్నారని విమర్శించారు. కేసీఆర్ 6 సంవత్సరాల పాలన అంధకార పాలన అన్నారు. తెలంగాణ క్యాబినెట్‌ గొర్రెల మందలా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మొత్తం 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 30 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 29 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, 2019లో కేవలం 42 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారన్నారు. టీఎస్‌పీఎస్‌సీలో 28 లక్షల మందిని నిరుద్యోగులుగా నమోదు చేశారు కానీ.. ఇప్పటికీ వారికి నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. (కేసీఆర్‌ వాహనానికి ట్రాఫిక్‌ చలానా!)

తన ఇంట్లో మాత్రం అందరికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు ఓడించిన వారిని సైతం మళ్లీ పునర్‌ నియామకం చేస్తున్నారని చెప్పారు. యూనివర్శిటీలలో పార్ట్‌టైం వీసీలను పెట్టి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఒక్క మహిళకు కూడా ఇల్లు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు  4 లక్షల కరోనా పరీక్షలు జరిగితే.. తెలంగాణలో మాత్రం 30 వేల పరీక్షలు మాత్రమే జరిగాయన్నారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌లో కూడా అవినీతికి పాల్పడుతున్నారన్నారని తెలిపారు. రకారకాల నిబంధనల పేరుతో రైతుబంధులో కూడా కోతలు పెట్టారన్నారు.  అందుకే కేసీఆర్‌కు సర్వేలో 16వ స్థానం దక్కిందని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన రూ. 11 వందల కోట్ల ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను కేసీఆర్‌ దారి మళ్లీంచారని తెలిపారు. కరోనా హాస్పీటల్‌కు ఇచ్చిన డబ్బులు కూడా వాడుకున్నారని ఆరోపించారు. కేంద్రం ఆడిగిన ప్రశ్నలకు తెలంగాణ జవాబు ఇవ్వడం లేదని మంత్రి పేర్కొన్నారు. (వలస కార్మికుల ఖాతాల్లో రూ. 10 వేలు జమ చేయండి)

మరిన్ని వార్తలు