‘ఏపీ నేతలు చాలా మంది టచ్‌లో ఉన్నారు’

3 Sep, 2019 15:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే బీజేపీ బలపడుతుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. త్వరలోనే ఏపీలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించబోతుందని జోస్యం చెప్పారు. ఏపీ నేతలు చాలామంది టచ్‌లో ఉన్నారని, వారంతా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో చిచ్‌చాట్‌ చేశారు. ఈ సందర్భంగా మురళీధర్‌రావు మాట్లాడుతూ... తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీయే తమ మొదటి టార్గెట్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే దమ్ము ఒక బీజేపీకే ఉందన్నారు. తెలంగాణ బీజేపీ ప్రస్తుతం రెండు పొలిటికల్‌ చాలెంజ్‌లు న్నాయని, ఒకటి బీజేపీపై ప్రజలకు విశ్వాసం కల్పించడం, రెండోది రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఉన్న 29శాతం ఓట్లను బీజేపీకి మళ్లించడం అని మురళీధర్‌ పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌ ఎదుర్కొనే దమ్ము తమ పార్టీ దగ్గర ఉన్నప్పుడే కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు తమ పార్టీకి మల్లుతుందన్నారు. గవర్నర్‌తో రాజకీయం చేస్తే తమ పార్టీకే నష్టం జరుగుతుందన్నారు. ఏపీలో కులం కార్డు పనిచేస్తుందని, తెలంగాణలో అది పనిచేయదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేక విధానమే బీజేపీ కొనసాగిస్తుందని మురళీధర్‌రావు స్పష్టం చేశారు. ఆర్టికల్‌370 రద్దు ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు దేశవ్యాప్తంగా 400 సభలు పెడతామని వెల్లడించారు.అందులో తెలంగాణలో  నియోజవర్గానికి ఒకటి చొప్పున 17 సభలు నిర్వహిస్తామని ప్రకటించారు.

మరిన్ని వార్తలు