రాజధానిలో లక్షమందితో బీజేపీ భారీ ర్యాలీ

31 May, 2018 16:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రానున్న ఎన్నికల్లో విజయమేధ్వేయంగా జాతీయ రాజధాని ఢిల్లీలో భారీ ర్యాలీలను నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఢిల్లీ నేతలతో చర్చలు జరిపారు. ఢిల్లీలోని మొత్తం ఏడు పార్లమెంట్‌ స్థానాలు, 70 అసెంబ్లీ స్థానాల్లో భారీ ర్యాలీలను నిర్వహించాలని  భావిస్తోంది. ఈ ర్యాలీలో అమిత్‌ షాతో సహా ప్రధాని మోదీ కూడా పాల్గొని ప్రసంగించనున్నారు.

బీజేపీ జాతీయ నాయకత్వం పాల్గొనే ఈ ర్యాలీలో లక్షమందికి పైగా పార్టీ కార్యకర్తలతో ర్యాలీని నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేతలు ప్రకటించారు. 45 శాతం వరకు ఓటింగ్‌ ప్రభావం గల పూర్వాంచాలీస్‌లో బలపడాలని బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది. దానిలో భాగంగానే 2016 భోజ్‌పూరి నటుడు, బీజేపీ నేత మనోజ్‌ తివారిని ఢిల్లీ యూనిట్‌ ప్రెసిడెంట్‌గా నియమించింది. 2017 ఏప్రీల్‌లో జరిగిన పురపాలక ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం వెనుక మనోజ్‌ తివారి కృషి ఎంతో ఉంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా దెబ్బతిన్న ఢిల్లీలోని  స్లమ్‌ ఏరియాలో మరింత దృష్టి సారిస్తామని తివారి పేర్కొన్నారు.  బీజేపీ ప్రధానంగా పూర్వాంచాలీస్‌ పైనే ఎక్కువగా దృష్టి సారించింది. వారి ప్రభావం గల 20 అసెంబ్లీ స్థానాలతో సహా, 80 పురపాలక వార్డులు బీజేపీకి ఎంతో కీలకం కానున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ 67 స్థానాల్లో విజయం సాధించగా బీజేపీ కేవలం మూడు స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్‌ ఖాతా కూడా తెరవలేకపోవడం విశేషం.

మరిన్ని వార్తలు