మౌనమెందుకు రాహుల్‌?: బీజేపీ

28 Jun, 2018 04:06 IST|Sakshi
సంబిత్‌ పాత్ర

న్యూఢిల్లీ: పన్ను ఎగవేతకు సంబంధించి బావ రాబర్ట్‌ వాద్రాకు ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం నోటీసులు పంపడంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ ఎందుకు మాట్లాడటం లేదని బీజేపీ బుధవారం ప్రశ్నించింది. ఈ అంశంపై రాహుల్‌ మాట్లాడాలని డిమాండ్‌ చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ‘బావకు నోటీసులు రావడంపై రాహుల్‌ ఎందుకు మౌనంగా ఉన్నారు?’ అని ప్రశ్నించారు. ‘యూపీఏ ప్రభుత్వ హయాంలో మాల్యా, వాద్రాలు చట్టాలను ఉల్లంఘించి కోట్లు గడించారు. అప్పుడు సకల సౌకర్యాలతో బతికిన వారు ఇప్పుడు కష్టాలను ఎదుర్కొంటున్నారు. అక్రమార్కులను మేం ఎలా చూస్తామో, యూపీఏ ఎలా చూసిందో మీరే చెప్పాలి’ అని విలేకరులతో సంబిత్‌ పాత్ర అన్నారు.

మరిన్ని వార్తలు