రైతులకు వడ్డీ లేని రుణాలు

14 Oct, 2019 03:17 IST|Sakshi

25 లక్షల మంది యువతకు శిక్షణ

హరియాణాలో బీజేపీ మేనిఫెస్టో

చండీగఢ్‌: మళ్లీ అధికారంలోకి వస్తే రైతులకు తనఖా లేకుండా రూ. 3 లక్షల వరకు వడ్డీలేని పంట రుణం, షెడ్యూల్‌ కులాల వారికి రూ. 3 లక్షల వరకు షరతుల్లేని రుణం ఇస్తామని బీజేపీ ప్రకటించింది. త్వరలో జరగనున్న హరియాణా అసెంబ్లీ ఎన్నికలకోసం ఆ పార్టీ ఆదివారం మేనిఫెస్టో విడుదల చేసింది. ‘ఇది పూర్తి నిబద్ధతలో రూపొందించిన పత్రం. సమాజంలోని అన్ని వర్గాలు ప్రయోజనం పొందేలా మేనిఫెస్టోను తయారు చేశాం’అని బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా చండీగఢ్‌లో ప్రకటించారు. సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ మాట్లాడుతూ, అవినీతి రహిత పాలన ఇవ్వాలన్న వాగ్దానాన్ని తాము నెరవేర్చామని, భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని అన్నారు.

మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు..
► రైతులకు 3 లక్షల వరకు వడ్డీ లేని పంట రుణం
► కర్షకుపంటలకు కనీస మద్దతు ధర. కిసాన్‌ కళ్యాణ్‌ ప్రధీకరణకోసం వెయ్యి కోట్ల బడ్జెట్‌
► యువజన అభివృద్ధి, స్వయం ఉపాధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు. రూ. 500 కోట్లతో 25 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ
► ఐదెకరాల లోపు ఉన్న 14 లక్షల మంది రైతులకు రూ. 3 వేల వృద్ధాప్య పెన్షన్‌.  
► విద్యార్థులకు ఉన్నత విద్యకోసం షరతులు లేని రుణాలు
► విద్యార్థినుల కోసం పింక్‌ బస్సు సేవలు. వారి ఆత్మరక్షణ కోసం ప్రత్యేక శిక్షణ.

మరిన్ని వార్తలు