సోనియాజీ..చిల్లర రాజకీయాలు తగదు..

23 Apr, 2020 17:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక వైరస్‌పై పోరాడాల్సిన సమయంలో మత విద్రోహ వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నారన్న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ విమర్శలను పాలక బీజేపీ తోసిపుచ్చింది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు చౌకబారు రాజకీయాలకు పాల్పడరాదని హితవు పలికింది. తాము మతపరమైన విభజనలను సృస్టించలేదని..కోవిడ్‌-19 మహమ్మారిపై పోరాడుతున్నామని కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ అన్నారు. కాంగ్రెస్‌ నేతలు చిల్లర రాజకీయాలకు పాల్పడరాని విజ్ఞప్తి చేస్తున్నామని, విపత్తు వేళ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడరాదని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో సోనియా గాంధీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరోనా వైరస్‌పై పోరాడాల్సిన సమయంలో బీజేపీ మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. మన సామాజిక సామరస్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నారని..ఈ నష్టాన్ని పూడ్చేందుకు తమ పార్టీ కష్టించి పనిచేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ పార్టీ మాజీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ సహా పలువురు పార్టీ అగ్రనేతలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

చదవండి : 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు..

>
మరిన్ని వార్తలు