సీఏఏ : బెంగాల్‌కు 30 వేల మందిని పంపనున్న బీజేపీ

26 Dec, 2019 12:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చట్టంపై సామాన్య ప్రజలక అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆ రాష్ట్రానికి 30 వేల మంది వాలంటీర్లను పంపాలని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా నేతృత్వంలో సూత్రపాయ నిర్ణయం తీసుకుంది. ఈ వాలంటీర్లు గ్రామ గ్రామాన వెళ్లి పౌరసత్వ సవరణ చట్టంపై సామాన్య ప్రజానీకానికి అవగాహన కల్పిస్తారు. వారిలో ఉన్న సందేహాలను నివృత్తి చేసి, చట్టం గురించిన పూర్తి సమాచారంతో వారిని చైతన్యవంతులను చేస్తారు. ఈ విషయంపై రేపు (శుక్రవారం) బీజేపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మరోసారి సమావేశం కానున్నారు.

కాగా, సీఏఏ, ఎన్నార్సీలపై కొంతమంది రాజకీయ నాయకులు ఒక వర్గాన్ని రెచ్చగొట్టి రాజకీయ స్వలాభం కోసం ప్రయత్నించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ అధికార వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలు సీఏఏ చట్టంతో భారతీయ పౌరులకు ఎలాంటి నష్టం వాటిల్లదని స్పష్టం చేసినా ఆందోళనలు ఆగకపోవడం కూడా ఈ నిర్ణయానికి మరో కారణంగా చెప్తున్నారు. మరోవైపు బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు రానుండడంతో ఈ చర్యతో ఎన్నికల్లో లబ్ది పొందే దిశగా బీజేపీ చర్య ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది వేసవిలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రికార్డు స్థాయిలో 18 ఎంపీ స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. చదవండిబెంగాల్‌ మంత్రికి వీసా నిరాకరించిన బంగ్లాదేశ్‌

మరిన్ని వార్తలు