కాళేశ్వరానికి అనుమతులిచ్చింది మేము కాదా: బీజేపీ

21 Jun, 2019 17:19 IST|Sakshi
బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కె.లక్ష్మణ్‌

ఢిల్లీ: టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, కుటుంబ పాలన, నియంత పోకడలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డాకు క్షుణ్ణంగా వివరిస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కె. లక్ష్మణ్‌ తెలిపారు. ఢిల్లీలో లక్ష్మణ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. చేనుకు నీరు.. చేతికి పని ఇదే మా నినాదమని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో టీఆర్‌ఎస్‌ పాత్ర ఎంత ఉందో, బీజేపీ పాత్ర కూడా అంతే ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు చెప్పే మాటలకు తెలంగాణ ప్రజలు మోసపోరని వ్యాఖ్యానించారు.

ర్యం ఉంటే కేసీఆర్‌ ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టు పూర్తి అయ్యేసరికి ఎన్నిలక్షల కోట్లు ఖర్చు అవుతాయో చెప్పాలని కోరారు. తెలంగాణ ప్రజల కోసం పాలనలో పారదర్శకంగా ఉండేందుకు వెబ్‌సైట్లో అన్నీ అందుబాటులో పెట్టాలని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టు పనుల అంశం గురించి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లామని చెప్పారు. తెలంగాణ ప్రజలకు సొంతింటి కల నిజం చేయడంలో టీఆర్‌ఎస్‌ విఫలమయిందని విమర్శించారు. 

కాళేశ్వరానికి అనుమతులు సాధించింది తాము కాదా?
కాళేశ్వరం ప్రాజెక్టుకి కేంద్రం నుంచి అనుమతులు సాధించింది తెలంగాణాకు చెందిన బీజేపీ నేతలు కాదా అని లక్ష్మణ్‌ సూటిగా టీఆర్‌ఎస్‌ నాయకులను ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తల మీద దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌ కుడి భుజం వినోద్‌ కుమార్‌ను కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి సంజయ్‌ ఓడించిన విషయాన్ని గుర్తు చేశారు. త్వరంలో సభ్యత్వ నమోదు పక్రియ ప్రారంభం కానుందని తెలిపారు.

మా పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై జరిగిన దాడిని చూస్తే బీజేపీ నేతలను టార్గెట్‌ చేస్తున్నట్లు కనపడుతోందన్నారు. జాతీయ రహదారులు, పలు అంశాలకు సంబంధించి కేంద్ర నాయకులను కలిశామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కీలకపాత్ర వహించారని పేర్కొన్నారు. టీడీపీ రాజ్యసభ ఎంపీలు ఒక నిర్ణయం తీసుకుని బీజేపీలో జాయిన్‌ అయ్యారు.. త్వరంలో పలువురు కీలకమైన నేతలు పార్టీలో చేరబోతున్నారని వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు