బీజేపీ విస్తరణకు సంపర్క్‌ అభియాన్‌

29 Sep, 2019 09:00 IST|Sakshi
మాట్లాడుతున్న బీజేపీ వరంగల్‌ రూరల్‌ అధ్యక్షుడు అశోక్‌ రెడ్డి, రావు పద్మ తదితరులు

రేపు జిల్లాకు కేంద్ర కార్మిక మంత్రి సంతోష్‌ గంగ్వార్‌

బీజేపీ వరంగల్‌ రూరల్, అర్బన్‌ జిల్లాల అధ్యక్షులు ఎడ్ల అశోక్‌ రెడ్డి, రావు పద్మ

సాక్షి, హన్మకొండ: పార్టీ విస్తరణలో భాగంగా సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీజేపీ వరంగల్‌ రూరల్, అర్బన్‌ జిల్లాల అధ్యక్షులు ఎడ్ల అశోక్‌ రెడ్డి, రావు పద్మ తెలిపారు. హన్మకొండ హంటర్‌ రోడ్డులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు కేంద్ర మంత్రులు దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా 30వ తేదీ సోమవారం హన్మకొండ రాంనగర్‌లోని నిత్య బాంక్వెట్‌ హాల్‌లో జరిగే సదస్సులో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు.

అలాగే, నగరంలోని పలువురు ప్రముఖులను కలుస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మేధావులతో పాటు వివిధ వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి మాట్లాడగా మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, నాయకులు సంగని జగదీశ్వర్, పాశికంటి రాజేంద్ర ప్రసాద్‌ పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు