కోర్టుతీర్పును స్వాగతిస్తున్నాం: లక్ష్మణ్‌

16 Apr, 2018 20:40 IST|Sakshi
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌ : మక్కా మసీదు పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందూ సమాజాన్ని వ్యతిరేకించే కాంగ్రెస్‌, మజ్లిస్ పార్టీలకు ఈతీర్పు చెంప పెట్టులాంటిదన్నారు. నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ కేసులో అమాయకులని ఇరికించిందన్నారు. అసలు నిందితులపై కీలక సాక్ష్యాలు లేకుండా చేసిందని ఆరోపించారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ కర్ణాటకలో బీజేపీని ఓడించే ప్రయత్నం చేస్తున్నారని, వాళ్ల జిమ్మిక్కులు అక్కడి ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు. ప్రత్యేక విమానంలో బెంగాల్‌, బెంగళూరుకు వెళ్లే సమయం ఉన్న కేసీఆర్‌కు అంబేద్కర్‌కు నివాళులు అర్పించే సమయం లేదా అని నిలదీశారు. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో అమిత్‌ షా పర్యటన ఉంటుందని లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కాంగ్రెస్‌తో ఆరో పెళ్లికి బాబు సిద్ధం

నిరుద్యోగ గర్జన సభ వాయిదా

కేసీఆర్‌.. తీస్‌మార్‌ ఖానా?

హస్తం పార్టీలో ఆన్‌లైన్‌ ‘పరీక్ష’!

సీనియారిటీ కన్నా సిన్సియారిటీ మిన్న

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇప్పుడు వంటూర్‌ వంతు

మరో గోల్డ్‌ దక్కింది

దేశీ ఫారెస్ట్‌ గంప్‌

మూఢ నమ్మకాలపై సందేశం

స్వార్థం వద్దు

ఇంటర్వెల్‌లో అర్థమవుతుంది