మాకు 25, మీకు 22 బీజేపీ ఫార్ములా

16 Feb, 2019 17:12 IST|Sakshi

సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పొత్తులపై రాజకీయ పార్టీలు వేగం పెంచాయి. లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీచేసేందుకు బీజేపీ, శివసేన మధ్య ఎట్టకేలకు పొత్తు చిగురించింది. మహారాష్ట్రలోని 48 ఎంపీ స్థానాల్లో బీజేపీ 25, శివసేన 23 సీట్లల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో శివసేన 22 స్థానాల్లో పోటీ చేయగా, బీజేపీ 26 సీట్లల్లో తమ అభ్యర్థులను నిలిపిన విషయం తెలిసిందే.

కాగా కీలక పొత్తుపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన అధినేత ఉద్దవ్‌ ఠాక్రే చర్చించి, గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ప్రధాని మోదీ కూడా సానుకూలంగా స్పందించిట్లు బీజేపీ వర్గాలు ప్రకటించాయి. కాగా అయోధ్య రామమందిర ఏర్పాటుపై శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ ఠాక్రే బీజేపీపై తీవ్ర స్థాయిల్లో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. కేవలం హిందూవుల ఓట్ల కోసమే అయోధ్య అంశాన్ని బీజేపీ తెరపైకి తెస్తోందంటూ ఠాక్రే  గతంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో శివసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆపార్టీ సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అమిత్‌ షా.. సేనను తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. చివరికి బీజేపీతో పొత్తుకి ఠాక్రే సానుకూలంగా స్పందించినట్లు బీజేపీ వర్గాల సమాచారం. కానీ శివసేన మాత్రం ఇంకా  పొత్తులపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.


 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ముఖాముఖి’లో గల్లంతైన కాంగ్రెస్‌

80% మోదీ మ్యాజిక్‌

కలిసుంటే మరో 10 సీట్లు

జూన్‌ రెండోవారంలోగా ‘పరిషత్‌’ కౌంటింగ్‌!

రాష్ట్రపతికి నూతన ఎంపీల జాబితా సమర్పించిన ఈసీ

ఆస్తి రూ.1,107 కోట్లు.. దక్కింది1,558 ఓట్లు

లోక్‌సభలో తొలి అడుగులు

జగన్‌ విజయం ప్రజా విజయం 

హామీలను వెంటనే అమలుచేస్తే అప్పుల ఊబిలోకే.. 

క్రాస్‌ ఓటింగ్‌తో గట్టెక్కారు!

వైఎస్‌ జగన్‌ ప్రమాణ ముహూర్తం ఖరారు

రాజకీయ ప్రక్షాళన చేద్దాం

కలసి సాగుదాం

‘దేశానికి ఆ రాష్ట్రాలే ముఖ్యం కాదు’

లివ్ అండ్ లెట్ లివ్ మా విధానం : కేసీఆర్‌

సరికొత్త ఉత్సాహంతో ముందుకెళ్తాం : మోదీ

లోటస్‌ పాండ్‌ వద్ద సందడి వాతావరణం

గురువారం మే 30.. మధ్యాహ్నం 12.23..

రాయపాటికి ఘోర పరాభవం

వైఎస్‌ జగన్‌ దంపతులకు కేసీఆర్‌ ఘన స్వాగతం

రాష్ట్రపతిని కలిసిన ఎన్నికల కమిషనర్లు

17వ లోక్‌సభ ప్రత్యేకతలు ఇవే!

కొత్త ముఖాలు.. కొన్ని విశేషాలు

రాహుల్‌ను బుజ్జగించిన కాంగ్రెస్‌ నేతలు

వాళ్లకు మనకు తేడా ఏంటి : విజయసాయి రెడ్డి

అది తప్పు.. సెల్యూట్‌ నేనే చేశా: గోరంట్ల మాధవ్‌

ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ మునక..?

వైఎస్ జగన్‌ ఢిల్లీ పర్యటన షెడ్యూల్‌..

రద్దయిన 16వ లోక్‌సభ

ఏయే శాఖల్లో ఎన్ని అప్పులు తీసుకున్నారు?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హాలీవుడ్‌ మళ్లీ పిలిచింది

పెళ్లి వద్దు... పిల్లలు కావాలి

లెక్కలు చెప్పేదాన్ని!

మెంటల్‌ రైడ్‌

బుద్ధిమంతుడు

అమెరికాలో సైలెంట్‌గా...