‘వారిద్దరికీ ఆనందం, ఆశ్చర్యం’

5 Dec, 2018 17:17 IST|Sakshi

చంద్రబాబు పెట్టుబడికి కాంగ్రెస్‌ ప్రచారం : లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను బరిలోకి దింపామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. ప్రజా కూటమి, అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలు చెప్పే వాటిల్లో పసలేదని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీకి వస్తున్న ఆదరణ, స్పందన చూసి ప్రధాని మోదీ, అమిత్‌ షా ఆనందం, ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిపారు. 50కి పైగా సభలు, పార్టీ అగ్రనాయకుల ప్రచారంతో బీజేపీకి గెలుపు మీద భరోసా వచ్చిందని లక్ష్మణ్‌ చెప్పారు. బీజేపీ మేనిఫెస్టో గురించి ప్రజలు ఆలోచిస్తున్నారని అన్నారు.

ప్రజల మూడ్‌ బీజేపీకి అనుకూలంగా ఉండడం చూసి కేసీఆర్‌, రాహుల్‌, చంద్రబాబులు బెంబేలెత్తుతున్నారని అన్నారు. దేశంలోని మిగతా చోట్ల ఎదురైన చేదు అనుభవాలే కాంగ్రెస్‌కు ఇక్కడా ఎదురౌతాయని జోస్యం చెప్పారు. చంద్రబాబు పెట్టుబడికి కాంగ్రెస్‌ ప్రచారం చేసుకుంటోందని ఎద్దేవా చేశారు. ప్రజల పార్టీలు కావాలో.. లేక కుటుంబ పార్టీలు కావాలో తేల్చుకోవాలని ప్రజలను కోరారు. మజ్లిస్‌ను ఎదుర్కొనే దమ్ము బీజేపీకి మాత్రమే ఉందని లక్ష్మణ్‌ ఉద్ఘాటించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా ఎన్నికల కమిషన్‌ విధులు నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు. డబ్బు, అధికార దుర్వినియోగం కాకుండా యువమోర్చా కార్యకర్తలు నిఘా వేయాలని సూచించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా