మహా రాజకీయం : డెడ్‌లైన్‌ చేరువైనా అదే ఉత్కంఠ

7 Nov, 2019 08:32 IST|Sakshi

ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 13 రోజులైనా తదుపరి సీఎం ఎవరనేది ఇంతవరకూ వెల్లడికాలేదు. అధికార పంపంకంపై బీజేపీ, శివసేనల మధ్య చిక్కుముడి వీడకపోవడం, శివసేనతో కలిసేందుకు ఇతర విపక్షాలు ముందుకురాని పరిస్థితితో తదుపరి మహారాష్ట్ర సర్కార్‌ ఏర్పాటులో ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరోవైపు ఈనెల 9న నూతన ప్రభుత్వం ఏర్పాటుకు డెడ్‌లైన్‌ తరుముకొస్తుండటంతో రాజకీయ పార్టీలతో పాటు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. డెడ్‌లైన్‌ నేపథ్యంలో గురువారం మహారాష్ట్ర గవర్నర్‌ను బీజేపీ ప్రతినిధి బృందం కలవనుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్‌ ఫిగర్‌కు ఆ పార్టీ చాలా దూరంలో నిలిచిన క్రమంలో ఈ ప్రతినిధి బృందానికి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ దూరంగా ఉన్నారు. శివసేన లేకుండా మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ సుముఖంగా లేదని చెబుతున్నారు.

మరోవైపు డెడ్‌లైన్‌ ముగిసిన తర్వాత ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించే అవకాశం ఉంది. ఇక ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ శివసేనకు మద్దతు ఇచ్చే విషయంలో కాంగ్రెస్‌ పార్టీ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం లేదని చెబుతున్నారు. సిద్ధాంత వైరుధ్యాల నేపథ్యంలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వం కొలువుతీరే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర ప్రజలు బీజేపీ-శివసేన కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చినందున ప్రభుత్వ ఏర్పాటుకు ఇరు పార్టీలు చొరవ చూపాలని అన్నారు. కాగా శివసేన మాత్రం తనతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధమని విస్పష్టంగా పేర్కొంటోంది. బీజేపీపై ఒత్తిడి పెంచేలా సేన వ్యాఖ్యలున్నాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇక శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే తన నివాసంలో కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పాత కూటమి... కొత్త సీఎం?

ఆర్టీసీ ‘మార్చ్‌’కు బీజేపీ మద్దతు

కార్యకర్తల కష్ట సుఖాల్లో అండగా ఉంటాం

 మీకు అధికారంలో ఉండే హక్కులేదు - సుప్రీం ఫైర్‌

‘పవన్‌ చేసిన ధర్నా పిచ్చి వాళ్లు చేసే పని’

‘అప్పటి నుంచే బాబుకు నిద్ర కరువైంది’

విజయారెడ్డి హత్యను ఖండిస్తున్నాం: కుంతియా

శివసేనకు షాక్‌.. శరద్‌ సంచలన ప్రకటన!

ఆ భూమి విలువ రూ. 100 కోట్లు: మంచిరెడ్డి

ఆర్టీసీ సమ్మె : ‘పెన్‌డౌన్‌ చేయాలని విఙ్ఞప్తి చేస్తాం..’

మీరు తాట తీస్తే.. మేము తోలు వలుస్తాం

ఆర్టీసీ మెకానిక్‌ మృతి : ‘డెడ్‌లైన్‌ పెట్టి వేధించారు’

ఆర్టీసీ సమ్మె : ‘50 వేల మందికి 360 మందే చేరారు’

వరుస భేటీలతో వేడెక్కిన మహా రాజకీయం​

మహా ఉత్కంఠ: రాష్ట్రపతి పాలన వస్తే..

వారసుడికి పార్టీ పగ్గాలు

పవన్, లోకేష్‌ శవ రాజకీయాలు మానండి 

గులాం నబీ సమక్షంలో కాంగ్రెస్‌ నేతల గలాటా 

బుజ్జగించేందుకు బాబొస్తున్నారు! 

దోపిడీ బాబు నీతులు చెప్పడమా? 

ఆర్‌సెప్‌పై మోదీ తగ్గడం మా విజయమే

ప్రైవేట్‌ బస్సులు నడిపితే తగులబెడతాం 

‘మహారాష్ట్ర’లో మార్పేమీ లేదు!

‘మంత్రి పదవి పోగానే ఎర్ర బస్సు ఎక్కక తప్పదు’

బీజేపీ కీలక ప్రకటన.. ప్రతిష్టంభన తొలగినట్లేనా?

ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన సంజయ్‌

‘సినిమాలకే కాదు.. రాజకీయాలకూ పనికిరాడు’

మాజీ ఎంపీ జేసీకి మరో ఎదురుదెబ్బ

నినాదాలు కాదు.. ఆచరణ ఎక్కడ..? : ఆజాద్‌

'నా పేరుతో అసభ్యకర పోస్టులు చేస్తున్నారు'

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ కాంబినేషన్‌ ఇప్పుడు సెట్‌ కానుందా?

ప్రేమ కాదు ఫ్రెండ్‌షిప్పే!

నా గొంతు వినండి

అంతా నిశ్శబ్దం

ప్రేమతోనే సమస్య

నాలుగేళ్లకు మళ్లీ!