ఈనెల 7న బీజేపీ మ్యానిఫెస్టో

5 Apr, 2019 10:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు వారం రోజుల వ్యవధి కూడా లేకపోవడంతో ఈనెల 7న తమ మ్యానిఫెస్టో విడుదల చేసేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. బీజేపీ మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ చీఫ్‌ అమిత్‌ షా సహా పలువురు సీనియర్‌ నేతలు పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని 20 మంది సభ్యులతో కూడిన మ్యానిఫెస్టో కమిటీలో కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, నిర్మలా సీతారామన్‌, పీయూష్‌ గోయల్‌, రవి శంకర్‌ ప్రసాద్‌, ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తదితర నేతలు సభ్యులుగా ఉన్నారు. మ్యానిఫెస్టో కమిటీలో 15 ఉప సంఘాలను ఏర్పాటు చేశారు.

కాగా 2014 లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిది విడతల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్‌ జరిగిన ఏప్రిల్‌ 7న బీజేపీ తన మ్యానిఫెస్టో సంకల్ప్‌ పత్రను విడుదల చేసింది. అయితే ఈసారి పోలింగ్‌కు 48 గంటల ముందు ఏ పార్టీ తమ మ్యానిఫెస్టోలను విడుదల చేయరాదని ఈసీ ఆదేశించింది. ఇక లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ ఇప్పటికే తన మ్యానిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. పేద కటుంబాలకు ఏటా రూ 72,000 నగదు సాయం అందించే న్యాయ్‌ పధకంపై ఆ పార్టీ భారీగా ఆశలు పెట్టుకుంది. మరోవైపు ఏడు దశల పోలింగ్‌ ముగిసిన అనంతరం మ్యానిఫెస్టో విడుదల చేస్తారా అంటూ ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ బీజేపీని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు