ప్రజలకు సీఎం జగన్ భరోసా కల్పించారు

24 May, 2020 04:51 IST|Sakshi

మంత్రి బొత్స సత్యనారాయణ 

ఏడాదిలోనే మేనిఫెస్టో అంశాలు పూర్తి చేసిన ఘనత జగన్ దే 

నవరత్నాలతో పేదల ఆర్థిక స్థితి మెరుగుపడింది

సాక్షి, అమరావతి: కష్ట, నష్టాల్లో తమ కుటుంబాన్ని ఆదుకుంటారనే భరోసా, ధైర్యం ప్రజలకు వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి కల్పించారని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలకు మహానేత వైఎస్సార్‌ ఉన్నారనే ధీమా ఉండేదని, మళ్లీ ఆ నమ్మకం, పేదలకు భరోసా, మారుమూల ప్రాంతాల ప్రజలకు ఒక ఆశ 2019 మే 23న వచ్చిందన్నారు. ఈ రోజు ప్రత్యేకమైనదని, సంక్షేమానికి నాంది పలికిన రోజు అని, చరిత్ర సృష్టించిన రోజు అని తెలిపారు. వైఎస్సార్‌సీపీ విజయంలో భాగస్వాములైన పార్టీ కార్యకర్తలకు, నాయకులు, ప్రజలకు అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బొత్స విలేకరుల సమావేశం నిర్వహించారు. మంత్రి బొత్స ఏమన్నారంటే..   

► ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలన్నింటినీ ఏడాది కాలంలోనే పూర్తి చేసిన ఘనత దేశ చరిత్రలో సీఎం వైఎస్‌ 
జగన్ ది మాత్రమే.  
► మేనిఫెస్టో అమలు చేయడం సాధ్యం కాదని విపక్షాలు చెప్పాయి. టీడీపీ వాళ్లు ఖజానా ఖాళీ చేశారు. రూ. 2.75 వేల కోట్ల అప్పుల్లో రాష్ట్రాన్ని టీడీపీ ముంచింది.  
► ఖజానా ఖాళీ చేసేశాం కదా.. ప్రభుత్వం అభాసుపాలవుతుందిలే అని టీడీపీ నేతలు అనుకున్నారు. కానీ, మనసుంటే మార్గం ఉంటుందని సీఎం వైఎస్‌ జగన్  నిరూపించారు.  
► నవరత్నాలను సృష్టించి వాటి ద్వారా పేదల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తున్నారు. చంద్రబాబు పెట్టిపోయిన బకాయిలను తీరుస్తున్నారు. 
► రైతే రాజు అనే వైఎస్సార్‌ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని రైతుల మేలు కోసం సీఎం వైఎస్‌ జగన్  ఎన్నో పథకాలను అమలు చేశారు. 
► వైఎస్సార్‌ పెన్షన్  కానుక మొదలుకొని, అమ్మ ఒడి, వైఎస్సార్‌ రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్‌ వాహనమిత్ర, వైఎస్సార్‌ నేతన్న హస్తం, వైఎస్సార్‌ మత్స్యకార భరోసా, లా నేస్తం లాంటి పథకాలే కాకుండా సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థ ద్వారా దాదాపు 4.30 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారు.  
► సంక్షేమ పథకాల అమలును జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.  
► ఏ అంశంలో మేము వైఫల్యం చెందామో వాళ్లు చెప్పాలి. మహానాడులో దేనిపైన చర్చపెడతారో.. దానిపైన మమ్మల్ని కూడా లైవ్‌లోకి తీసుకోవాలి.  
► భూముల అమ్మకం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు. గతంలో విజయనగరం నడిబొడ్డున ఉన్న రెండు ఎకరాలు ఆయన విక్రయించలేదా?.  
► విజయనగరం మూడు లాంతర్ల సెంటర్‌లో సిమెంట్‌ దిమ్మ మరమ్మత్తుకు గురైతే దానిని తొలగించి నూతనంగా నిర్మిస్తున్నాం. అది పురాతన నిర్మాణం కాదు. రాష్ట్ర ప్రజలు నిజం తెలుసుకోవాలి. 

మరిన్ని వార్తలు