‘రాష్ట్ర విభజనకు అనుకూలమని చెప్పింది ఈయనే’

20 Sep, 2018 14:53 IST|Sakshi
బొత్స సత్యానారయణ (ఫెల్‌ ఫోటో)

అశోక్‌ గజపతిరాజుపై బొత్స సత్యనారాయణ ధ్వజం

సాక్షి, విజయనగరం: ఏపీలో టీడీపీ ప్రభుత్వం దోచుకుందాం.. దాచుకుందాం అనే రీతిలో పరిపాలన కొనసాగుతుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. గురువారం విజయనగరంలో వైఎస్సార్‌ సీపీ విస్తృత స్థాయి సమావేశానికి ఆయనతో పాటు, పెనుమత్స సాంబ శివరాజు, కోలగట్ల వీర భద్రస్వామి, పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సమావేశం అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. పట్టణానికి చెందిన రాష్ట్ర గనుల శాఖ మంత్రి సుజయ్‌ క్రిష్ణ రంగారావు, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతి రాజులపై నిప్పులు చెరిగారు. ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..

సుజయ్‌.. దందాలు చేసుకోవడానికే
బొబ్బిలి రాజావారూ జిల్లా అభివృద్ది కోసం పార్టీ మారుతున్నామన్నారు. ఈ మూడు సంవత్సరాలలో ఈ అభివృద్ది చేశామని ధైర్యంగా చెప్పండి. తలదించుకుని మీ మందు నిలబడతా. ఆస్తులు కాపాడుకోవడానికి, దందాలు చేసుకోడానికి మీరు పార్టీ మారారు సుజయ్‌. ఇక అశోక్‌ గజపతిరాజు మీరు జిల్లాకు చేసింది శూన్యం. కేంద్ర మంత్రిగా ఉండి హోదా కోసం ఎప్పుడైనా మాట్లాడారా? కాంగ్రెస్‌ మోసం చేసిందని తీవ్ర ఆరోపణలు చేసి.. నేడు అదే కాంగ్రెస్‌తో ఎలా జతకడతారు? రోశయ్య మీటింగ్‌లో రాష్ట్ర విభజనకి అనుకూలమని చెప్పింది ఈయన గారే. భోగా పురం ఏయిర్‌పోర్టు టెండర్లు రద్దు చేసి ప్రయివేట్‌ వారికి ముడుపులు తీసుకుని అప్పజెప్పాలను కోవడం వాస్తవం కాదని.. మీ ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ముందు ప్రమాణం చేసి చెప్పే ధైర్యం ఉందా? 

ఇంటికో రేటు.. పెన్షన్‌కో రేటు వసూలు
మేం జిల్లా కేంద్రంలో జేఎన్టీయూ, ఆంధ్రా యునివర్సిటీ, కాలేజీలు, జూనియర్‌ కాలేజీలు ఏర్పాటు చేశాం.. మీరేం తెచ్చారో చెప్పండి? పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడానికి రామతీర్థ సాగర్‌ని మా హయాంలో మొదలు పెట్టాం. టీడీపీ నేతలు నేటికి పూర్తి చేయలేకపోయారు. ఇంటికో రేటు పెన్షన్‌కో రేటు పెట్టి వసూలు చేస్తున్నారు. టీడీపీ నాయకులు తాతగారి ఆస్తుల్లా 1300 కోట్లు అప్పనంగా చెల్లించారని కాగ్‌ బయటపెట్టింది. సీఎంకి ప్రయివేట్‌ సంస్థలకు వాటాలు నప్పకే అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలం తేలట్లేదు. తోటపల్లి వద్ద పడుకుని పూర్తి చేశానని చంద్రబాబు అనడం హాస్యాస్పదం.

సంక్షేమ రాజ్యం రావాలంటే..
ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసి వారికి ఓ భరోసాని ఇవ్వడానికి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. 11 జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకుని విజయనగరం జిల్లాకు చేరుకోనున్నారు. వైఎస్‌ జగన్‌కు కుర్చి మీద తపన ఆరోపణలు చేస్తున్నారు. నిజం జగన్‌కి కుర్చి కావాలి. పదవి ద్వారానే ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయగలరు. సంక్షేమ రాజ్యం రావాలంటే వైఎస్‌ జగన్‌ సీఎం కావాలి.. కావాల్సిందే. విజయనగరం జిల్లాలో జననేత మూడు వేల కిలోమీటర్ల మైలురాయికి చేరుకోవడం చారిత్రాత్మకం. 
 

మరిన్ని వార్తలు