'జేసీ డబ్బు, మద్యంతోనే రాజకీయం చేశారు'

6 Mar, 2020 19:06 IST|Sakshi

సాక్షి, అనంతపురం : చంద్రబాబు బీసీల ద్రోహి అని, టీడీపీ నేతలతో పిటిషన్లు వేయించి రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ అడుగడుగునా అడ్డుపడుతోందన్నారు. మార్చిలోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. నిధుల వృధా కాకుండా, అభివృద్ధికి ఆటంకం లేకుండా ఉండాలన్నదే తమ ద్యేయమన్నారు. కానీ రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలని టీడీపీ కుట్ర పన్నుతుందని పేర్కొన్నారు. బలహీన వర్గాలంటే చంద్రబాబుకు చిన్నచూపని  అందుకే బీసీల రిజర్వేషన్లను దుర్బుద్దితో అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. జేసీ దివాకర్‌రెడ్డి ఇన్నాళ్లు డబ్బు, మద్యంతోనే రాజకీయం చేశారని దుయ్యబట్టారు. రాజ్యాంగం, రాజకీయాల పట్ల జేసీకి ఏమాత్రం విలువ లేదని ఎద్దేవా చేశారు. ఇన్నా రోజులు డబ్బు, మద్యం పంచే టీడీపీ గెలిచినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించాలనేదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైనా డబ్బు, మద్యం పంచినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డబ్బు, మద్యం పంచుతూ పట్టుబడితే అనర్హత వేటు ఖామమని బొత్స తెలిపారు.(సిద్ధమైన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌)

సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా నాయకులే గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ అభివృద్ధికి సీఎం జగన్ నిరంతర కృషి చేస్తున్నారని తెలిపారు. బాబు వైఖరి దొంగే దొంగ అన్న చందంగా తయారైందన్నారు. బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచి గెలిస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న నామినేటెడ్‌  పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించిన ఘనత వైఎస్‌ జగన్‌దేనని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు