27న రాజధానిపై తుది నిర్ణయం : బొత్స

23 Dec, 2019 20:03 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు పేద ప్రజల భూములను దోచుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రూ. వేలకోట్ల అవినీతి జరిగిందన్నారు. ఇంతకాలం చేసిన దోపిడీ చాలక.. ఇప్పుడు అమాయక రైతును రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.  చంద్రబాబును నమ్మి మోసపోవద్దని రైతును కోరారు. అమరావతిలో ఆందోళన చేస్తున్న రైతులు నిరసనలు విరమించాలని కోరారు.

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇంతకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం అభివృద్ధి పరచి వారికి అందజేస్తామని చేశారు. జీఎన్‌ రావు కమిటీ అందజేసిన నివేదికపై ఈ నెల 27న నిపుణులతో చర్చించి, రాజధానిపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు మధ్య అసమానతలు ఉండకూడదని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేందాలనే మూడు రాజధానులు ప్రతిపాదన తెచ్చామన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..


గత రెండు రోజులు నుంచి అమరావతి ప్రాంతంలో కొందరు నిరసన చేస్తుంటే ప్రతి పక్ష నేత చంద్రబాబు ఆ ప్రాంతానికి వెళ్లి ముసలి కన్నీరు కారున్నారు. సచివాలయం, హైకోర్టు ఉండడం వల్ల ఏ  ప్రాంతం అభివృద్ధి జరగదు అని చంద్ర బాబు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. పెయిడ్‌ ఆర్టిస్టులతో సోషల్‌ మీడియాలో దుర్భాలాడిస్తున్నారు. రాజధాని, రాజధాని కట్టడాలు పేరు చెప్పి వేల కోట్లు దోచుకున్న చంద్రబాబు.. ఇప్పుడు వచ్చి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. గత ప్రభుత్వ దోపిడిని అమరావతి వాసులు అర్థం చేసుకోవాలి. మోసపూరిత వ్యక్తుల మాటలు నమ్మోద్దు. రైతులకు మేలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.  

ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగకుండా చూసుకుంటాం. జీఎన్‌ రావు కమిటీ నివేదికను ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. బీజేపీ నాయకులు సైతం వికేంద్రీకరణపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు మధ్య అసమానతలు ఉండకూడదు అని పరిపాలనా వికేంద్రీకరణ చేస్తున్నాం. 14 రాష్ట్రాల్లో సచివాలయం ఒక చోట, హైకోర్ట్ ఒక చోట ఉంది. శ్రీభాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఉండాలి. ప్రజల అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లే ప్రభుత్వం మాది. రైతులు చంద్రబాబు ట్రాప్‌లో పడోద్దు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధే మా ప్రభుత్వ ధ్యేయం’ అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు