‘అది సాహసోపేతమైన నిర్ణయం’

27 Jul, 2019 17:48 IST|Sakshi

సాక్షి, అమరావతి : అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు నాయుడు 600 హామీలను ఇచ్చి 6 హామీలను కూడా నెరవేర్చలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నింటిని అమలు చేస్తున్నామని చెప్పారు.

ఇచ్చిన మాట ప్రకారం యువతకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు.ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు. 4లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఒక్కో సచివాలయానికి 10 మందిని నియమిస్తామని చెప్పారు. సుమారు 37.86వేల మంది కార్యదర్శులను నియమిస్తామన్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించి వారి ద్వారా ప్రభుత్వ పథకాలను డోర్‌ డెలివరీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ద్వేషి
అధికారంలోకి వచ్చిన 60రోజుల్లోనే ఎన్నో చారిత్రాత్మక బిల్లును తీసుకొచ్చామని మంత్రి బొత్స సత్యనారయణ అన్నారు. నామినేటెడ్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50శాతం​ రిజర్వేషన్‌ కల్పించామన్నారు. నామినేటేడ్‌ పదవు, నామినేషన్‌ పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ ఇవ్వడం సాహసోపేతమైన నిర్ణయం అన్నారు. చంద్రబాబు నాయుడు ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ద్వేషి అని విమర్శించారు. మంచి పనులకు మద్దతు ఇవ్వకుండా చంద్రబాబు సభ నుంచి పారిపోయారని ఆరోపించారు.  గత ప్రభుత్వం భూముల పేరుతో రాజధానిలో పెద్ద కుంభకోణం చేశారన్నారు. రాజధాని పేరుతో గ్రాఫిక్స్‌ చూపించి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.

విజయవాడలో వైఎస్సార్‌ విగ్రహం ఏర్పాటు
సెప్టెంబర్‌ 2న విజయవాడలో వైఎస్సార్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి బొత్స పేర్కొన్నారు. వైఎస్సార్‌ విగ్రహాన్ని పెట్టే ప్రాంతాన్ని పార్క్‌గా అభివృద్ధి చేస్తామన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కేశినేని నానికి రామకృష్ణ కౌంటర్‌

ఆజంను క్షమించే ప్రసక్తే లేదు : రమాదేవి

జమ్మూకశ్మీర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం

‘రాజకీయం’లో అందరూ దొంగలేనా!

బీజేపీకి కుమారస్వామి మద్దతు!

ఎన్నికల వరకే రాజకీయాలు: ఎమ్మెల్యే శిల్పా

ఇంటింటికీ కాంగ్రెస్‌

జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికే హానికరం

అవినీతి నిర్మూలనకే ‘ముందస్తు న్యాయ పరిశీలన’

ఆదర్శనీయంగా మా పాలన

ఆజం ఖాన్‌పై మండిపడ్డ మహిళా లోకం

కన్నడ పీఠంపై మళ్లీ ‘కమలం’

‘అది నిజంగా గొప్ప విషయం’

రాజగోపాల్‌ రెడ్డి, వివేక్‌ ఆలోచించాలి : రేవంత్‌

జనసేన ‘ఒకే ఒక్కడి’కి నో ఛాన్స్‌

‘మ‌ర‌ణశిక్ష విధించాలనేది మా అభిప్రాయం కాదు’

కర్ణాటక సీఎంగా యెడియూరప్ప

ఇది ఇక్కడితో ఆగిపోదు: సీఎం వైఎస్‌ జగన్‌

మాస్టర్‌ ప్లాన్‌ నివేదించండి 

ఆ మాట చెప్పిన ధైర్యమున్న నేత వైఎస్‌ జగన్‌

అందుకే జ్యుడిషియల్‌ బిల్లు : అంబటి 

ప్రపంచ చరిత్రలోనే ఎవరూ చేయని సాహసం

అందుకే నర‍్సాపురం వచ్చా: నాగబాబు

‘సుబాబుల్ రైతులను ఆదుకుంటాం’

స్విస్‌ చాలెంజ్‌తో భారీ అవినీతి: బుగ్గన

పేరు మార్చిన యడ్డీ.. మరి రాత మారుతుందా?

‘బీజేపీ ఆఫర్‌ బాగా నచ్చింది’

రైతులకు గిట్టుబాటు ధరల కోసమే ఈ బిల్లు

ఈ బిల్లు సీఎం జగన్‌ దార్శనికతకు నిదర్శనం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సంపూ ట్వీట్‌.. నవ్వులే నవ్వులు

బిగ్‌బాస్‌.. జాఫర్‌, పునర్నవి సేఫ్‌!

దిల్ రాజు ప్యానల్‌పై సీ కల్యాణ్ ప్యానల్‌ ఘనవిజయం

ఇది ‘మహర్షి’ కలిపిన బంధం

ప్రేమలో పడ్డ ‘చిన్నారి’ జగదీశ్‌!

కన్నడనాట ‘కామ్రేడ్‌’కి కష్టాలు!