నా వ్యాఖ్యలను వక్రీకరించారు : బొత్స

10 Dec, 2019 12:21 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాజధానిలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎలాంటి అభివృద్ది చేయలేదని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో బొత్స మాట్లాడుతూ.. రాజధానిపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నపై కాకుండా సభను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అలాగే ప్రభుత్వం రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలో ఉందని వెల్లడించారు.

అంతకు ముందు తిరుమల ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ భద్రతపై రవాణా శాఖ మంత్రి పేర్ని నాని సభలో మాట్లాడారు. 15 ఏళ్లు దాటిన బస్సులేవి ఆర్టీసీలో లేవని తెలిపారు. ప్రయాణికుల భద్రత విషయంలో ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ నంబర్‌ వన్‌గా ఉందన్నారు. చిత్తూరు జిల్లాలో 1278 బస్సులు ఫిట్‌నెస్‌గా ఉన్నాయని చెప్పారు. తిరుమల బస్సులన్నీ నాణ్యత ప్రమాణాల మేరకే ఉన్నాయని స్పష్టం చేశారు. ఏప్రిల్‌ నాటికి 1000 కొత్త కొనుగోలు చేయనున్నట్టు వెల్లడించారు. అలాగే 350 ఎలక్ట్రిక్‌ బస్సులకు టెండర్లు పిలుస్తామని తెలిపారు.

చదవండి : మేనిఫెస్టోలో చెప్పనవి కూడా చేశాం : సీఎం జగన్‌

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా