టీడీపీ నేతలు చెప్పిందే చట్టమా

27 Dec, 2017 02:15 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ఏపీలో టీడీపీ నేతలు చెప్పేదే చట్టం అన్నట్లుగా చెలామణి అవుతోందని, అధికారపక్షం రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించాలో అంతగా పట్టించారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం, ధర్మం, రాజ్యాంగం ఏవీ కూడా టీడీపీ నేతలకు వర్తించడం లేదని ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఏపీ అంటే అరాచక ఆంధ్రప్రదేశ్, మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని, టీడీపీ ఎంపీ మాగంటి బాబు కార్యాలయం (కైకలూరు) పేకాట డెన్‌గా మారిందని విమర్శించారు. చంద్రబాబు సర్కారు అక్రమార్కులకు అండగా నిలుస్తోందని, విజయవాడలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్, ఎంపీ ఇంట్లో పేకాట, దుర్గమ్మ ఆలయ భూముల కబ్జా, రోడ్ల వెడల్పు పేరుతో 40 దేవాలయాలను కూల్చివేయడం, సదావర్తి భూములను కాజేసేందుకు ప్రయత్నం.. ఇలా కుట్రలన్నింటిలో బాబు ప్రభుత్వం అండగా నిలిచిందని ధ్వజమెత్తారు. ఎంపీ అంటే మాగంటి పేకాట అన్నట్లుగా.. సీఎం అంటే ఛీటింగ్‌ మినిస్టర్, క్రిమినల్‌ మినిస్టర్‌ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు