బ్రెజిల్ ఆరోగ్య‌శాఖ ‌మంత్రి రాజీనామా‌

16 May, 2020 12:50 IST|Sakshi

బ్రెసిలియా : కరోనా కాలంలోనూ బ్రెజిల్‌లో రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు దేశం‌లో క‌రోనా విల‌య తాండవం చేస్తుంటే మ‌రోవైపు ఆ దేశ‌ ఆరోగ్య‌శాఖ మంత్రి నెల్స‌న్ టీచ్ త‌న ప‌ద‌వికి శుక్ర‌వారం రాజీనామా చేశారు. మంత్రిత్వ బాధ్య‌త‌లు చేప‌ట్టి నెల గ‌డ‌వ‌క ముందే ఆయన రాజీనామ చేయ‌డం గ‌మ‌నార్హం. దేశంలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో  టీచ్‌పై అనేక విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే నెల్స‌న్ తన మంత్రి పదవికి రాజీనామ చేశారు. క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల్లో బ్రెజిల్ అధ్య‌క్షుడు బొల్సొనారోతో విభేధించి రాజీనామా చేసిన రెండవ బ్రెజిలియన్ ఆరోగ్య మంత్రి నెల్సన్ టీచ్‌ కావడం గమనార్హం. ఇప్ప‌టికే క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల్లో చురుగ్గా పాల్గొంటున్న మాజీ మంత్రి లూయూజ్ హెన్నిక్ మండెట్టాను అధ్యక్షుడు బొల్సొనారో తొల‌గించ‌గా.. ఆయన స్థానంలో ఏప్రిల్ 17న టీచ్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.
(కరోనా: ఫ్రాన్స్‌ను దాటేసిన బ్రెజిల్‌)

దీనిపై నెల్స‌న్ మాట్లాడుతూ.. 'జీవితం అనేది ఎన్నో ఎంపికల స‌మూహం. హోదాను చూసి ఈ ప‌ద‌విలోకి రాలేదు. దేశానికి, ప్ర‌జ‌ల‌కు ఎంతో కొంత స‌హాయం చేయాల‌ని ఈ రంగంలోకి వ‌చ్చాను. కరోనా వైరస్‌ కట్టడికి నా వంతుగా అనేక ప్రయత్నాలు చేశారు'. అని తెలిపారు. అయితే త‌న రాజీనామ‌కు దేశ అధ్యక్షుడు మాత్రం కార‌ణం కాదని వెల్ల‌డించ‌లేదు. కానీ దేశంలో జ‌రుగుతున్న ప‌రిస్థితుల‌ను, వాస్త‌వాల‌ను అంగిక‌రించని బొల్సొనారో నిర్ణ‌యంతో అసంతృప్తి చెందిన‌ట్లు తెలిపారు. బ్రెజిల్‌లో ప్ర‌స్తుతం మ‌రింత కేసులు పెర‌గ‌నున్న‌ట్లు, అయితే కేసుల‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా లేద‌ని ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించారు. (ఏపీలో 2205కు చేరిన కరోనా కేసులు )

ఇక బ్రెజిల్‌లో క‌రోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పాజిటివ్‌ కేసులు జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్‌ను దాటాయి. అమెరికా త‌రువాత బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. శుక్ర‌వారం ఒక్క‌రోజు 15 వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం క‌రోనా బారిన ప‌డిన వారి సంఖ్య 2 ల‌క్ష‌లు దాటింది. మ‌ర‌ణాల సంఖ్య 15 వేల‌కు చేరాయి. 80 వేల మంది చికిత్స నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. (జౌరియా ప్రమాదానికి కారణం వారే: మాయావతి )

మరిన్ని వార్తలు