‘బాండ్లు అంటే అప్పుచేసే విధానం తప్ప మరొకటి కాదు’

19 Aug, 2018 12:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ ప్రభుత్వం బాండ్ల ద్వారా నిధులు సమీకరిస్తూ గొప్పలు చెప్పుకోవడంపై పీఏసీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. అసలు బాండ్లు అంటే అప్పుచేసే విధానం తప్ప మరొకటి కాదని, అటువంటప్పుడు అమరావతి బాండ్లకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. స్వాతంత‍్ర్య దినోత్సవం కన్నా అమరావతి బాండ్లకే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని తప్పుబట్టారు. టీడీపీ చేసే ప్రతిపనిలో మతలబు ఉంటుందని బుగ్గన తెలిపారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించిన బుగ్గన.. అమరావతి బాండ్లకు ఎక‍్కడలేని విధంగా 10.75 శాతం వడ్డీ చెల్లించడాన్ని ప్రశ్నించారు.

బుగ్గన ఇంకా ఏమన్నారంటే..

*ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా 194 బాండ్లు జారీ అయ్యాయి
*అందులో 4 బాండ్లకు మాత్రమే 10 శాతం వడ్డీ
*అమరావతి బాండ్లకు 10 శాతానికి పైగా వడ్డీ
*ప్రపంచంలోనే మొదటిసారి బాండ్లు ఇచ్చినట్లు హడావుడి చేస్తున్నారు
*బాండ్లు వస్తాయో లేదో అని గ్రీన్‌షు ఆప్షన్‌ పెట్టుకున్నారు
*తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బాండ్లు జారీ చేయాలి
*బ్యాంకుల వద్ద అప్పు చేసేందుకు మీవద్ద అవకాశం లేక.. బాండ్లు తీసుకొచ్చారు
*ఎందుకంటే బ్యాంకుల వద్ద అప్పు చేయాలంటే పారదర్శకత ఉండాలి
*అప్పులు చేసి గొప‍్పలు చెప్పుకుంటున్నారు
*బాండ్ల పేరుతో ప్రజలను అయోమయానికి గురి చేశారు
*అమరావతి బాండ్లలో ఆ 9 మంది ఇన్వెస‍్టర్స్‌ ఎవరు
*సింగపూర్‌కు కాంట‍్రాక్ట్‌ ఇస్తున్న ప్రభుత్వం.. అక‍్కడ తక్కువ వడ్డీకి అప్పు వస్తున్నా ఎందుకు తీసుకోవడం లేదు
*2014 నాటికి ఏపీకి రూ. 95 వేల కోట్ల అప్పు ఉండేది
*2018 నాటికి 2 లక్షల 50 వేల కోట్ల అప్పులు పెరిగాయి
*ఏపీలో ప్రతి కుటుంబంలపై లక్షన్నర  అప్పు ఉంది
*సీఆర్డీఏ పరిధిలో రూ. 829 కోట్ల విలువైన పనులు మాత‍్రమే జరిగాయి
*వేల కోట్ల పనులు జరుగుతున్నట్లు తప్పుడు ప‍్రచారం చేస్తున్నారు
*టీడీపీ కార్యాలయం సీఆర్డీఏ పరిధిలో ఎందుకు పెట్టలేదు
*అప్పుకు.. గ్రాంట్‌కు తేడా తెలియని వ్యక్తి మంత్రి లోకేష్‌
*అప్పు చేస్తే మనమే కట్టుకోవాలి.. కేంద్రం ఇచ్చిన గ్రాంట్‌ను తిరిగి కట్టాల్సిన అవసరం లేదు

మరిన్ని వార్తలు