బీజేపీలో చేరిన బైరెడ్డి, కౌశల్‌

28 Nov, 2019 22:11 IST|Sakshi

సాక్షి, న్యూడిల్లీ : మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి, బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 2 విన్నర్‌ కౌశల్‌ గురువారం బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా సమక్షంలో వీరు బీజేపీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు బైరెడ్డి కుమార్తె శబరి, కౌశల్‌ సతీమణి నీలిమ బీజేపీ చేరినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. వారిని బీజేపీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.

అనంతరం బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందాలన్నదే తన కోరిక అని తెలిపారు. దేశంలో పరిస్థితులు బాగుపడాలంటే ప్రధాని నరేంద్ర మోదీ నిస్వార్థ రాజకీయాలు అవసరం అని అభిప్రాయపడ్డారు. అందుకోసమే తాను బీజేపీలో చేరారని వెల్లడించారు. త్వరలోనే కర్నూలులో బహరింగ సభ నిర్వహిస్తామని.. ఆ సభకు రావాల్సిందిగా జేపీ నడ్డాను కోరినట్టు చెప్పారు.

కౌశల్‌ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలు దేశం కోసం పనిచేస్తున్న తీరు ఆకట్టుకుందని తెలిపారు. వారి నాయకత్వంలో పనిచేయడం కోసం బీజేపీలో చేరినట్టు చెప్పారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మంచి చేసినా తట్టుకోలేకపోతున్న బాబు

కరోనా కన్నా చంద్రబాబు ప్రమాదకారి

ప్రజలకు అండగా ఎమ్మెల్యేలుంటే తప్పేంటి?

‘డాక్టర్లకు ఆ పరిస్థితి రావడం దురదృష్టకరం’

బాబు 40 ఏళ్ల రాజకీయ జీవితం ఇంతేనా?

సినిమా

కరోనా విరాళం

కూతురి కోసం...

తమ్మారెడ్డి భరద్వాజకు మాతృ వియోగం

శ్రీలక్ష్మి కనకాల ఇకలేరు

నీలి నీలి ఆకాశం @ 10 కోట్లు!

ఒక్కరికైనా సాయపడండి