సభ్యత్వ రద్దు అప్రజాస్వామికం: కుంతియా

14 Mar, 2018 03:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దు, సస్పెన్షన్ల వ్యవహారాన్ని ఏఐసీసీ ఖండించింది. ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలను సస్పెండ్‌ చేయడం దురదృష్టకరం. కోమ టిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ల సభ్యత్వ రద్దు అప్రజాస్వామి కం.

కాంగ్రెస్‌ హయాంలో హరీశ్‌రావు అసెంబ్లీలో వ్యవహరించిన తీరు, పార్లమెం టులో టీఆర్‌ఎస్‌ ఎంపీలు వెల్‌లోకి వెళ్లి గందరగోళం చేసినప్పుడు లేని తప్పు.. అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చేస్తే వచ్చిందా? టీఆర్‌ఎస్‌ నేతలు తమను తాము ప్రజాస్వామికవాదులు అనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేసినంత మాత్రానా ఆందోళనలు ఆగవు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కాంగ్రెస్‌ పోరాడుతుంది. సభలో ఏం జరిగిందో ఫుటేజీ బయటపెట్టాలి. ప్రజాస్వామ్యయుత పార్టీలన్నీ ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించాలి’ అని అన్నారు.

>
మరిన్ని వార్తలు