లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ

21 Aug, 2019 11:15 IST|Sakshi

సుప్రీంకోర్టులో లభించని ఊరట

అజ్ఞాతంలోకి చిదంబరం!

సాక్షి, న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పి.చిదంబరంకు అరెస్ట్‌ నుంచి ఊరట లభించేలా లేదు. ముందస్తు బెయిలు పిటిషన్‌ కోసం ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. మంగళవారం సాయంత్రమే దానిని తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో చిదంబరం తరపున లాయర్లు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై వాడీవేడి చర్చ జరుగుతోంది. ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు బెంచ్‌ నిరాకరించింది. మరోవైపు చిదంబరానికి బెయిల్‌  నిరాకరించాలని సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది.

పిటిషన్‌ను సీజేఐకి ట్రాన్స్‌ఫర్‌ చేయాలని చిదంబరం తరఫున లాయర్లు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌ను పరిశీలించిన  ఎన్‌వీ రమణ నేతృత్వంలోని బెంచ్‌, దీనిపై తదుపరి  ఆదేశాలిచ్చేందుకు నిరాకరించారు. ఈ పిటషన్‌ను లంచ్‌ తరువాత సీజే రంజన్‌ గొగోయ్‌  దీనిపై విచారణ జరుతారని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సీజే తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు చిదంబరంపై ఈడీ లుక్‌ అవుట్‌ నోటీసులను జారీచేసింది.  దీంతో చిదంబరం అరెస్ట్‌కు అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన అజ్ఞాతంలోకి పోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

మరిన్ని వార్తలు