లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌పై ఫిర్యాదులు పరిశీలిస్తున్నాం : ఈసీ

24 Mar, 2019 19:32 IST|Sakshi

సాక్షి, అమరావతి : రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాపై వచ్చిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. సినిమా విషయంలో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు వ్యవహరిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు.పరిశీలన తర్వాత తుది నిర్ణయం వెలువరిస్తామని ఆయన స్పష్టం చేశారు.


మార్చి 25న ఓటర్ల తుది జాబితా  
ఈనెల 25న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటుచేసుకోకుండా చూశామని, కొత్త ఓట్ల చేర్పుపై దుష్ప్రచారం చేయవద్దని కోరారు.రాష్ట్రంలో ఎవరి ఓటు తొలగించలేదని, దరఖాస్తు చేసిన వారిలో అర్హులైన వారందరికి ఓటు హక్కు కల్పించామని చెప్పారు.

కాగా, రాష్ట్రానికి 75మంది ఎన్నికల పరిశీలకులను నియమించామని, ప్రతి రెండు లోక్‌సభ నియోజక వర్గాలకు ఓ పోలీస్ పరిశీలకుడు., ఓ సాధారణ పరిశీలకుడు,ప్రతి మూడు అసెంబ్లీ నియోజక వర్గాలకు ఓ సాధారణ పరిశీలకులు పర్యవేక్షిస్తారని చెప్పారు.రాజకీయ పార్టీలు, ప్రజలు పరిశీలకులకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు.

మరిన్ని వార్తలు