పెట్రో ధరల బాధ్యత కేంద్రానిదే -యనమల

22 May, 2018 09:43 IST|Sakshi
ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు (పాత ఫోటో)

సాక్షి, అమరావతి:  అడ్డూ అదుపులేకుండా పెరిగిపోతున్న చమురు ధరలపై  ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు స‍్పందించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుబట్టారు.  అంతర్జాతీయంగా చమురు ధరల హెచ్చు తగ్గుల సందర్భంగా కేంద్రం తీరుపై ఆయన నిరసన వ్యక్తం చేశారు.   పెరిగినపుడు పెంచడమే తప్ప, ధరలు తగ్గినపుడు దేశీయంగా  ఎందుకు తగ్గించడం లేదని మండిపడ్డారు.   పెరుగుతున్న ధరల ప్రభావం  మధ్య తరగతి ప్రజలపై తీవ్రంగా పడుతోందన్నారు.

ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్  ధరలు పెరిగినప్పుడల్లా దేశంలో కేంద్రప్రభుత్వం కూడా  ధరలు పెంచటం వల్ల  ప్రజలపై తీవ్రమైన భారం పడుతుందని యనమల వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మధ్య తరగతి  ప్రజల మీద ఎక్కువ భారం పడుతోందన్నారు.  ఇంటర్నేషనల్ మార్కెట్లో ధర  తగ్గినప్పుడు కేంద ప్రభుత్వం తగ్గించడంలేదనీ, పెరిగినపుడు మాత్రం సదరు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచాలని ఆదేశాలు జారీ చేస్తుందన్నారు. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలంటూ రాష్ట్రాలను కేంద్రం ఆదేశించడం సరైనది పద్దతి కాదని యనమల పేర్కొన్నారు. మార్కెట్ లో క్రూడ్ ఆయిల్  ధర పెరిగినపుడు ప్రజలు మీద భారం పడకుండా చేసే భాద్యత  కేంద్ర ప్రభుత్వమే వహించాలన్నారు.  తద్వారా ప్రజల మీద భారం తగ్గించాలని ఆయన  కోరారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా