రాజకీయ నేతలతో ఈసీ బృందం భేటీ

22 Oct, 2018 17:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్‌ కమిషనర్‌ ఓం ప్రకాశ్‌ రావత్‌ నేతృత్వంలోని బృందం సోమవారం మధ్యాహ్నం రాష్ట్రానికి చేరుకుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఈసీ బృందం రాష్ట్రంలోని గుర్తింపు పొందిన 9 రాజకీయ పార్టీల నాయకులతో హోటల్‌ తాజ్‌ క్రిష్ణలో భేటీ అయ్యింది.

ఈసీతో సమావేశానికి ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు నేతలు హాజరుకానున్నట్లు సమాచారం. అంతేకాక ఈసీ ఒక్కో పార్టీ నాయకులతో దాదాపు 10 నిమిషాల పాటు సమావేశం కానున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈసీతో భేటీ నిమిత్తం అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు హోటల్‌ తాజ్‌ క్రిష్ణకు చేరుకున్నారు. ఎన్నికల సంఘం అధికారులు వీరితో ముఖాముఖి నిర్వహించి అభిప్రాయాలు సేకరించనున్నారు.

ఈసీ బృందంతో భేటికి హాజరైన పార్టీలు - సభ్యులు
బీఎస్పీ - సిద్ధార్థ్ పూలే
బీజేపీ - ఇంద్రసేనా రెడ్డి, బాలసుబ్రహ్మణ్యం
సీపీఐ - చాడ వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు
సీపీఎం - నంద్యాల నర్సింహా రెడ్డి, వెంకటేష్
ఎంఐఎం - ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీ జాఫ్రీ
టీఆర్ఎస్ - వినోద్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి
కాంగ్రెస్ - మర్రి శశిధర్ రెడ్డి, నిరంజన్
టీడీపీ - రావుల చంద్రశేఖర్ రెడ్డి, గురుమూర్తి
వైసీపీ - రవికుమార్, సంజీవరావు

పార్టీలతో సమావేశం ముగిసిన అనంతరం ఈసీ బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్, పోలీసు విభాగం నోడల్‌ అధికారి, అదనపు డీజీ జితేందర్‌రెడ్డిలతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీయనుంది.

రేపటి షెడ్యూల్‌

  • మంగళవారం ఉదయం 9.30 నుండి  మధ్యాహ్నం 1.30 వరకు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు,డీఐజీలు, ఐజీలతో సమావేశం
  • మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 7 గంటల వరకు అన్ని జిల్లాల డిఇఓలు, ఎస్పీలతో సమావేశం

బుధవారం షెడ్యూల్‌

  • ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు నోడల్ అధికారులు, ఇంకమ్ టాక్స్ అధికారులు, బ్యాంకు అధికారులు, రైల్వే, ఎయిర్‌పోర్ట్‌, సీపీఎఫ్, రాష్ట్ర పోలీస్ అధికారులతో సమావేశం
  • ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సీఎస్, డీజీపీ, ఫైనాన్స్ సెక్రటరీ, ఆబ్కారీ ముఖ్య కార్యదర్శి, రవాణా అధికారులతో భేటీ
  • మధ్యాహ్నం 12.30 గంటల నుండి 1.00 వరకు మీడియా సమావేశం
  • అనంతరం తిరిగి ఢిల్లీ వెళ్లనున్న ఈసీ బృందం
మరిన్ని వార్తలు