తెలంగాణలో ఎన్నికలు; కీలక వివరాలు..

9 Sep, 2018 20:00 IST|Sakshi
రజత్‌ కుమార్‌(పాత చిత్రం)

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ రద్దు అనంతరం రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించింది. ఈ విషయంపై చర్చించడానికి రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌ కుమార్‌ సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రానున్న ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ పనులు మొదలు పెట్టిందని తెలిపారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం రెండు రోజుల పాటు(సెప్టెంబర్‌ 11,12 తేదీల్లో) రాష్ట్రంలో పర్యటించనుంది. తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల గురించి ఈ బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి వివరాలు అందజేస్తుంది. ఈ బృందం11వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు గుర్తింపు పొందిన 8 రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. 12వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం తెలంగాణలోని కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర బృందం చర్చలు జరుపుతోంది. అలాగే సాయంత్రం సీఎస్‌, డీజీపీలతోపాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశం అవుతార’ని వెల్లడించారు.

మరిన్ని వార్తలు