కేజ్రీవాల్‌ సర్కార్‌కు ఎదురుదెబ్బ..

27 Jun, 2019 14:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేజ్రీవాల్‌ సర్కార్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. దేశ రాజధానిలో మెట్రో, బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేలా ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్రతిపాదనను కేంద్రం గురువారం తిరస్కరించింది. కాగా  ఏడాది చివరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల జరుగునున్న విషయం తెలిసిందే. దానిని దృష్టిలో ఉంచుకుని పలు పథకాలకు ఆప్‌ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. దీనిలో భాగంగానే మహిళలకు ఉచిత రవాణ సౌకర్యాన్ని కల్పించింది. ఇందుకు అయ్యే ఖర్చును ఢిల్లీ ప్రభుత్వమే భరిస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరంలేదని.. వెంటనే అమలు చేస్తామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా కేంద్రం తాజా నిర్ణయంతో కేజ్రీవాల్‌ సర్కార్‌ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

చదవండి: 

త్వరలో మహిళలకు మెట్రోలో ఫ్రీ జర్నీ

ఢిల్లీ మహిళలకు శుభవార్త

మరిన్ని వార్తలు