ఛీబీఐగా మారింది : చాడ

23 Oct, 2018 11:16 IST|Sakshi
సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి

కరీంనగర్‌: భారత అత్యున్నత విచారణ సంస్థ సీబీఐ, ఇప్పుడు ఛీబీఐగా మారిందని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ..న్యాయవ్యవస్థతో పాటు సీబీఐ లాంటి సంస్థలకు కూడా అవినీతి చీడ పట్టుకుందని విమర్శించారు. పాలకుల అవకాశవాద రాజకీయాలతో అవినీతి పెరిగిపోయిందని దుయ్యబట్టారు. భారత ప్రధాని మోదీకి చిత్తశుద్ధి, నిజాయతీ ఉంటే సీబీఐపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

ఎన్నికల విధానం లోపభూయిష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. మహాకూటమి స్వేచ్ఛాయుత ఎన్నికలపై దృష్టి పెడుతుందని వెల్లడించారు. సీట్ల సర్దుబాటు త్వరలోనే పూర్తవుతుందని తెలిపారు. సముచితమైన, గౌరవప్రదమైన ఒప్పందాలు కూటమిలోనే జరుగుతామని అన్నారు.

మరిన్ని వార్తలు