మాఫీ రుణాలపై వడ్డీని ప్రభుత్వమే భరించాలి

24 Nov, 2017 02:15 IST|Sakshi

సీఎం కేసీఆర్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: రైతులకు మాఫీ అయిన రుణాలపై వడ్డీని ప్రభుత్వమే భరించాలని, రుణమాఫీ పథకంలో నిబంధనలను సడలించి మరి కొంతమంది రైతులకు రుణమాఫీ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన గురువారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. సీపీఐ నిర్వహిస్తున్న పోరుబాట సందర్భంగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌ జిల్లాల్లో అనేక చోట్ల రుణమాఫీ పథకం వర్తించలేదన్న విషయాన్ని రైతులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు.

మ్మం జిల్లా కొణిజర్ల మండలంలో అనేక గ్రామాల్లో 26 వేల మంది రైతులు తమకు రుణమాఫీ వర్తించలేదని చెప్పారు. కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌లో 215 మంది రైతులు యూకో బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు చెల్లించినా రూ.26 లక్షల వడ్డీ చెల్లించాలని బ్యాంకు లేఖలు రాసిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రీ షెడ్యూల్‌ చేసుకున్న రుణాలను మాఫీ చేయడంతోపాటు, మాఫీ రుణాలపై వడ్డీని ప్రభుత్వమే భరించాలని కోరారు.

మరిన్ని వార్తలు