అక్కాచెల్లెమ్మలకు దగా

8 Apr, 2019 10:52 IST|Sakshi

టీడీపీ గడచిన ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలో మహిళలకు సంబంధించి చేసిన హామీలివి..

  •  ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం బెల్టుషాపులను రద్దు చేస్తూ రెండో సంతకం చేస్తాం. డీఅడిక్షన్‌ సెంటర్లను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తాం.
  •  ఆర్థిక చిక్కుల్లో పడిన డ్వాక్రా సంఘాలకు ఊపిరిపోసేందుకు రుణాలన్నింటినీ మాఫీ చేస్తాం. మహిళా సంఘాలకు రూ.లక్ష వరకు వడ్డీలేని రుణాలు ఇస్తాం. 
  •  మహిళలు ఆర్థిక పురోభివృద్ధి సాధించేందుకు పరిశ్రమలు, పెద్ద ఎత్తున వ్యాపారాలు చేపట్టే స్థాయికి విస్తరిస్తాం. 
  •  పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరుతో మహాలక్ష్మి పథకం కింద అర్హులైన కుటుంబాలకు రూ.30వేలు బ్యాంకులో డిపాజిట్‌ చేసి యుక్త వయసు వచ్చే నాటికి రూ.2లక్షలు అందిస్తాం. 
  •  పండంటి పథకం ద్వారా పేద గర్భిణులకు ఆరోగ్యం, పౌష్టికాహారం కోసం రూ.10వేలు అందిస్తాం. 
  •  పేద మహిళలకు స్మార్ట్‌ 
  • సెల్‌ఫోన్లు ఉచితంగా ఇస్తాం. 
  •  ఏడాదికి ఒక కుటుంబానికి 12 వంట గ్యాస్‌ సిలిండర్లను ఇచ్చి  సిలిండర్‌కు రూ.100 సబ్సిడీ ప్రకారం ఆధార్‌ కార్డుతో సంబంధం లేకుండా సరఫరా చేస్తాం. 
  •  అన్నీ ప్రభుత్వ కాలేజిల్లో విద్యార్థినులకు హాస్టల్‌ వసతి కల్పిస్తాం. 
  •  పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌ ద్వారా ఆమోదింపజేసే ప్రయత్నం చేస్తాం. 
  •  అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు మెరుగుపరచడంతోపాటు కార్యకర్తలకు వేతనాలను పెంచుతాం.    
  •  మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు కుటీర లక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సహాయం, శిక్షణతోపాటు ప్రత్యేక పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేస్తాం.
  •  పేద వితంతువులకు రూ.1000 పింఛన్‌ మంజూరు చేస్తాం. 

పై హామీలు ఏమేరకు అమలు చేశారంటూ మహిళలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కొత్త హామీలకు పసుపు రంగు పులుముతూ తమను మోసగించవద్దని చెబుతున్నారు.టమహిళల రక్షణకు సంబంధించి ప్రత్యేక పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఐజీ స్థాయి అధికారిని, డివిజన్‌లో ఎస్పీ స్థాయి మహిళా అధికారిని, జిల్లాలో అడిషనల్‌ ఎస్పీ స్థాయి మహిళా అధికారిని, మండలంలోని సీఐ స్థాయి మహిళా అధికారిని, పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌ మహిళా అధికారిని నియమిస్తామని ముఖ్యమంత్రి గతంలో తెలిపారు. నిర్భయ చట్టాన్ని, గృహ హింస చట్టాన్ని, ఇతర మహిళా చట్టాలను కఠినంగా అమలు చేసి విద్యార్థినులపై, మహిళలపై అత్యాచారాలకు అడ్డుకట్ట వేస్తాం. కానీ గడచిన అయిదేళ్లలో మహిళలకు రక్షణ కొరవడింది.  మహిళా కమిషన్‌ పటిష్టపరుస్తామన్న మాటలే మిగిలాయి.  

బాలికలకు పథకాలేవీ..
బాలికలకు సంబంధించిన పథకాలు ఏవీ అమలులో లేకపోవడం ఇబ్బందికరంగా ఉంది. తరచూ ఆడపిల్లల తల్లిదండ్రులు తమను సంప్రదిస్తున్నారు. ఏ పథకం లేదని చెబుతున్నాం. 


– ఎ.రాజమ్మ, అంగన్‌వాడీ కార్యకర్త, నాగేంద్రనగర్, ప్రొద్దుటూరు

     

మరిన్ని వార్తలు