‘చంద్రబాబు బీసీలను అవహేళన చేశారు’

27 Jan, 2019 16:42 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీలకు ఇచ్చిన 119 హామీలను నెరవేర్చకుండా వారిని అవహేళన చేశారని వైఎస్సార్‌ సీపీ అనకాపల్లి పార్లమెంట్‌ సమన్వయకర్త వరదు కల్యాణి మండిపడ్డారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో బీసీలకు అనేక సంక్షేమ పథకాలు అందాయన్నారు. వైఎస్సార్‌ స్వర్ణయుగం మళ్లీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితోనే సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వంలో కలిసి ఉన్నపుడు ఏపీకి ప్రత్యేకహోదా కావాలని అడగని..

ఏనాడూ దీక్షలు చేయని చంద్రబాబు ప్రజలను మోసం చేయటానికే దొంగ దీక్షలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలను మభ్య పెట్టడానికే పోస్ట్‌ డేటెడ్‌ చెక్‌లు ప్రవేశపెట్టారని తెలిపారు. నిజంగా మహిళలకు సహాయం చేయాలని ఉంటే తక్షణమే చెక్కులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు