‘మోదీపై నమ్మకం కోల్పోయాం’

12 Mar, 2018 19:30 IST|Sakshi
చంద్రబాబునాయుడు

సాక్షి, అమరావతి : ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్ర మోదీ మాట మార్చారని, ఆయనపై నమ్మకం లేకే కేంద్ర ప్రభుత్వం నుంచి బయటికి వచ్చామని ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. సోమవారం శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందన్న ఆశ, నమ్మకంలేదని తేల్చిచెప్పారు. కేంద్రం ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని, రాష్ట్రాన్ని కేంద్రం చిన్నచూపు చూసిందని అసహనం వ్యక్తం  చేశారు.

ఇక భవిష్యత్‌ కార్యాచరణ గురించి ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలోనే తాను అత్యంత సీనియర్‌ సీఎంనని మరోసారి తనకు తాను కితాబిచ్చుకున్నారు. దేశ అభివృద్ధిపై తాను మోదీకే సలహాలు ఇచ్చేవాడినని చెప్పుకొచ్చారు. దేశంలో టెక్నాలజీని అభివృద్ధి చేసింది తానేనని,  హైదరాబాద్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన ఘనత తనకే దక్కుతుందని చంద్రబాబు అన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు