పవన్‌ కోరితే మద్దతిచ్చాం

5 Nov, 2019 05:02 IST|Sakshi

టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు   

సాక్షి, అమరావతి:  పవన్‌కల్యాణ్‌ కోరడంతో లాంగ్‌మార్చ్‌కు మద్దతిచ్చామని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న పవన్‌ను మంత్రులు విమర్శించడం సరికాదన్నారు. విజయవాడలో సోమవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతిలో రూ.2 లక్షల కోట్ల సంపదను సృష్టించామని, అనేక కంపెనీలను తీసుకొచ్చామని చంద్రబాబు చెప్పారు. పార్టీలో యువ రక్తాన్ని తేవాలని, 33 శాతం పదవులు 33 ఏళ్లలోపు వారికే ఇస్తామని చెప్పారు.

బీసీలను మళ్లీ దగ్గరకు చేర్చుకునేందుకు కృషి చేయాలని, మాదిగలు ఎప్పుడూ టీడీపీ వెంటే  ఉండేవారని వారికి భరోసా ఇవ్వాలని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని, పనులు కోల్పోయిన కార్మికులకు నెలకు రూ.10 వేల ఆర్థ్ధిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్ర హ్మణ్యంను బదిలీ చేసి అవమానించారని ఒక ప్రకటనలో బాబు విమర్శించారు. 

మరిన్ని వార్తలు