చంద్రబాబు మేడిన్‌ మీడియా

12 Dec, 2019 20:41 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మేడిన్‌ మీడియా. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేడిన్‌ పబ్లిక్‌. అదీ ఆయనకూ ఈయనకూ తేడా. వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు ఒక్క పేపరే ఉందేమో. చంద్రబాబుకు చాలా పేపర్లున్నాయి. వండుకున్నవాళ్లకు ఒకకూరే. దండుకున్న వాళ్లకు దండిగా అన్నట్టుంది బాబు వ్యవహారం... అని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఏపీ అసెంబ్లీ ఆంగ్ల మాధ్యమంపై చర్చ సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ‍్యలకు మంత్రి కన్నబాబు పైవిధంగా స్పందించారు.

యూ టర్న్‌ బాబు జన్మహక్కు
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఒక విషయాన్ని పదే పదే చెబుతారు. ఆ తర్వాత యూ టర్న్‌ తీసుకుంటారు. మొన్నటిదాకా ఆంగ్లమాధ్యమం వద్దన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత రావడంతో ఇప్పుడేమో వ్యతిరేకం కాదంటున్నారు. యూ టర్న్‌ అనేది బాబు జన్మహక్కు అని చెప్పుకోవాలి. ఏదో పేపర్లలో వచ్చిన దాన్ని చెప్పి ఇక్కడ హడావిడి చేయాలనుకుంటున్నారు. ఇలాగైతే దేశవ్యాప్తంగా 14వేల పేపర్లున్నాయి. అవన్నీ స్లిప్పులు తెచ్చి చదివితే సమయం సరిపోదు అంటూ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఎద్దేవా చేశారు.

ఎంబీఏ ఫెయిలైనప్పుడు బాధ తెలిసింది
నేను డిగ్రీవరకూ తెలుగుమీడియంలో చదివాను. ఎంబీఏలో చేరి ఇంగ్లీష్‌ రాక ఫెయిలయ్యాను. అప్పుడు తెలిసింది ఆ బాధేమిటో. ముఖ్యమత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయంతో నిరుపేద, బలహీన వర్గాల పిల్లలందరికీ ఆంగ్లం నేర్చుకునే అవకాశం వస్తోంది. చెంప దెబ్బలు తగిలాక తిరిగి బాబు యూటర్న్‌ తీసుకున్నారు. ఆయన పాలనలో ప్రాథమిక విద్య నిర్వీర్యం అయింది. ఇప్పుడు మళ్లీ పేద, బడుగు బలహీన వర్గాల చిన్నారులకు మంచి విద్య అందబోతున్నందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రికి కతృజ్ఞతలు చెప్పుకుంటున్నా అని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు అన్నారు.

>
మరిన్ని వార్తలు