రాజధానిలో బాబు దిష్టిబొమ్మ దహనం

28 Nov, 2019 12:01 IST|Sakshi

తాడేపల్లి: రాజధానిలో చంద్రబాబు పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రవర్తించిన తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలపుతున్న తమపై పచ్చపార్టీ శ్రేణులు గుండాల్లా దాడులు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అన్నదాతలపై టీడీపీ నేతల దాడులను నిరసిస్తూ రాజధాని ప్రాంతం రైతులు గురువారం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజధాని పేరుతో భూములు తీసుకుని చంద్రబాబు తమకు అన్యాయం చేశారని, ఈ అన్యాయాన్ని నిలదీయడానికి వస్తే..  చంద్రబాబు విజయవాడ గుంటూరు నుంచి తీసుకువచ్చి రౌడీలను తీసుకొచ్చి తమపై దాడి చేయించారని రైతులు మండిపడుతున్నారు. రాజధానికి‌ భూములు ఇచ్చినందుకు ప్రతిఫలంగా చంద్రబాబు తన పార్టీ కార్యకర్తలతో తమపై దాడి చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి చంద్రబాబుకు కచ్చితంగా బుద్ధిచెప్తామని హెచ్చరించారు. రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు, నిరసనల నడుమ చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలు రాజధానిలో పర్యటిస్తున్నారు.
చదవండి: అమరావతిలో బాబుకు నిరసన సెగ

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా