అయ్యో.. కుప్పం

16 Mar, 2019 08:46 IST|Sakshi

ఈ ఫొటోలు చూశారా..?ఇది ఎక్కడో కాదు.. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడుప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరుజిల్లా కుప్పంలో దృశ్యాలివి. పట్టణంలోని పలు వీధుల్లో కనీసం సిమెంటు రోడ్లు కూడా లేవు.  ఇక్కడ ఇళ్లు లేని వారు కనీసం లక్ష మంది ఉంటారని అంచనా. ఏ గ్రామంలోకి వెళ్లినా ఇప్పటికీ గుడిసెలే కనిపిస్తాయి.ఇళ్ల కోసం ‘జన్మభూమి’లో 47,569 మంది దరఖాస్తు
చేస్తే కేవలం 1,200 మందికి మాత్రమే కేటాయించారు. ఇక చిత్తూరు జిల్లాఅక్షరాస్యత 80 శాతం కాగా ఎక్కువ మందినిరక్షరాస్యులు ఉండేది కుప్పంనియోజకవర్గంలోనే కావడంగమనార్హం. దాదాపు 500 ఉపాధ్యాయ పోస్టులు కుప్పంలో ఖాళీగా ఉన్నాయి.  

కుప్పంలో రోడ్ల గురించి ఎంతచెప్పుకున్నా తక్కువే. సుమారు85 గ్రామాలకు రహదారి సదుపాయమే లేదు. ఇది కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉండే పిల్లిగానిపల్లి గ్రామం. 250 మంది నివాసం ఉండే ఈ ఊరికి కనీసం రోడ్డు కూడా లేదు. ఇక్కడకు వెళ్లాలంటే నరకమే.ఇలా రహదారులు లేని గ్రామాలు కుప్పం నియోజకవర్గంలో సుమారు 185 ఉన్నాయి. రోడ్లు వేయాలని సీఎంకు ఎన్నిసార్లుమొరపెట్టుకున్నా పని మాత్రం కాలేదు.

నాటు సారా!

రాజధాని అమరావతిని సింగపూర్‌లా చేస్తా అంటూ తరచూ చెప్పే చంద్రబాబు కుప్పంలో కనీసం కాలువలు కూడా నిర్మించలేకపోయారని పట్టణ ప్రజలు ఎగతాళి చేస్తున్నారు. ఇక్కడమురుగు రోడ్డుపైనే ప్రవహిస్తుంటుంది. నియోజకవర్గంలో ఏ గ్రామంలో చూసినా టీడీపీ నేతలునిర్వహించే నాటుసారా బట్టీలే  దర్శనమిస్తాయి. గుడుపల్లి, కుప్పం, శాంతిపురం మండలాల్లోసారా బట్టీలు అధికంగా ఉన్నాయి. పొరుగురాష్ట్రాలకు కూడా ఇక్కడినుంచే సరఫరా అవుతోందని అధికారులే చెబుతున్నారు.   

గుక్కెడు నీళ్లూ కరువే..
కుప్పం ప్రజలు తాగు కోసం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. దీన్ని గుర్తించిన దివంగత వైఎస్సార్‌ పాలారు డ్యాం నిర్మించి కనీసం సగం గ్రామాలకైనా సమస్య లేకుండా చేయాలని భావించారు. దీని కోసం రూ.50 కోట్ల నిధులువిడుదల చేసినా దీన్ని కూడా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు.

మరిన్ని వార్తలు