చంద్రబాబు రాజకీయ దళారి...

30 Oct, 2019 12:59 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘చంద్రబాబు ఒక రాజకీయ దళారి. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో లేకుంటే మంచిదని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారకుడు. ఆయన తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకుని, ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. బాబు హయాంలో టీడీపీ నేతలు ఇసుకను వేలకోట్లలో దోచుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చంద్రబాబు దివాళా తీయించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వనరులు కాపాడాలనే ఉద్దేశంతో ఉన్నారు. ప్రతి అంశంలో ఒక పాలసీ ప్రకారం ముందుకు వెళుతున్నారు. 

 5 నెలల సీఎం జగన్‌ పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. సీఎం జగన్‌ మంచి పరిపాలన చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. వర్షాలు తగ్గిన వెంటనే ఇసుక కొరతను శాశ్వతంగా లేకుండా చేస్తాం. డైటింగ్‌ కార్యక్రమంలా లోకేష్‌ దీక్ష చేస్తున‍్నారు. భవన నిర్మాణ కార్మికులను తన రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు వాడుకుంటున్నారు. కూలీలు, భవన నిర్మాణ కార్మికులకు భరోసా ఇస్తున్నాం. తప్పుడు మాటల వినొద్దు. మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది.  మీ కుటుంబాల శ్రేయస్సు మా బాధ్యత.’ అని హామీ ఇచ్చారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మున్సిప‌ల్ కార్మికుల‌పై హ‌రీష్‌రావు ఆగ్ర‌హం

మోదీ నిర్ణయానికి సంపూర్ణ మద్దతు : సోనియా

ఇప్పుడూ నీచ రాజకీయాలా?

బలపరీక్ష నెగ్గిన చౌహాన్‌ 

కరోనా ఎఫెక్ట్‌ : రాజ్యసభ ఎన్నికలు వాయిదా

సినిమా

బుల్లితెర కార్మికులకు యాంకర్‌ ప్రదీప్‌ చేయూత

కిచెన్‌ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్‌

ఏఆర్‌ రెహమాన్‌ కచ్చేరీలు రద్దు 

కరోనా విరాళం

17 ఏళ్లు... 20 సినిమాలు

‘జుమాంజి’ నటికి కరోనా