మానవత్వం అంటే.. అది

28 Oct, 2018 13:21 IST|Sakshi

సాక్షి, తిరుపతి సెంట్రల్‌: తెల్లటి పంచెకట్టుతో.. నల్లటి బ్యాడ్జి ధరించి.. రోడ్డుపై అభిమానుల మధ్య.. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి మౌనముద్రలో ఉన్న ఈ ఫొటో చాలు.. రాజకీయాల్లో ఆ మహానేత మానవత్వం, హుందాతనం గురించి చాటడానికి. తిరుపతిలో అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇది. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నాన్ని ఖండించాల్సింది పోయి.. సీఎం చంద్రబాబు సహా టీడీపీ మంత్రులు, నేతలు ఎదురుదాడికి దిగడం తెలిసిందే.

ఆ మహానేత రాజన్నకు, సీఎం చంద్రబాబుకు మధ్య ఎంత వ్యత్యాసం ఉందో ప్రజలే గుర్తించాలని చాటేందుకే నాటి దీక్ష ఫొటోతో తిరుపతిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ ఎదుట బైఠాయించిన వైఎస్సార్‌సీపీ నాయకులు ఎస్‌కే బాబు, కోటూరు ఆంజినేయులు, నల్లాని బాబు, తాళ్లూరి ప్రసాద్, అమర్‌నాథరెడ్డి తదితరులు చంద్రబాబు వైఖరిపై ధ్వజమెత్తారు.

నాడు ప్రతిపక్ష నేత హుందాతనం
హుందాతనం అంటే ఇది... ప్రజానాయకుడంటే ఇలా ఉండాలి. 2003లో అప్పటి సీఎం చంద్రబాబుపై అలిపిరిలో దాడి జరిగిన సమయంలో నాటి విపక్ష నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తిరుపతిలో మౌనదీక్ష చేస్తున్న దృశ్యం.

నేడు ముఖ్యమంత్రి వెకిలితనం
వెకిలితనానికి నిదర్శనం ఇది...  ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే పరామర్శించాల్సింది పోయి... సీఎం చంద్రబాబు మీడియా సమావేశంలో వెలికిగా నవ్వుతూ అభ్యంతరకర భాషతో మాట్లాడారు. ప్రతిపక్ష నేతపై ఏకవచనంతో దూషణలకు దిగారు.

మరిన్ని వార్తలు