వైఎస్‌ అలా.. బాబు ఇలా.. 

18 Mar, 2019 07:24 IST|Sakshi

సాక్షి, అమరావతి:  చేనేత కుటుంబాలకు 100 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్‌ అని ఎన్నికలు సమీపిస్తున్న వేళ మూడు నెలల క్రితం చంద్రబాబు ప్రకటించారు. కానీ అమలుకు 
నోచుకోలేదు.  
- వర్షాకాలంలో ఆరుబయట నేతకు వీలుగా షెడ్లు వేస్తామని 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు.  
- వైఎస్‌ఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు చేనేతలకు హెల్త్‌ కార్డులిచ్చారు. రూ.500 నుంచి రూ.1,500 వరకు వైద్యానికయ్యే ఖర్చును చెల్లించేవారు. చంద్రబాబు దానికి మంగళం పాడేశారు. 
- చేనేత కుటుంబాలకు పూర్తిగా పని కల్పించేందుకు వీలుగా ప్రభుత్వ ఉద్యోగులు విధిగా వారానికి రెండు రోజులు ఖద్దరు వస్త్రాలు ధరించేలా వైఎస్‌ఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. దాన్ని అమలు చేసే లోగా మరణించారు. 
- వైఎస్‌ హయాంలో చేనేత వికలాంగులకు నెలకు 25 కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చేవారు. చంద్రబాబు వచ్చాక దానిని ఎగ్గొట్టారు.
- వైఎస్‌ పాలనలో తక్కువ వడ్డీకి రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు రుణాలిచ్చారు. బాబు వచ్చాక ఇవ్వడం లేదు. రూ.15 వేల విలువచేసే కుంచె, పైపులకు 90 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు. కానీ ఇవ్వలేదు. చేనేత కార్మికులకు జిల్లాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్న హామీ నిలబెట్టుకోలేదు.  

మరిన్ని వార్తలు