ఉమ్మడిగా ఉద్యమిస్తాం

18 Jan, 2020 02:46 IST|Sakshi

చేతులు కలిపిన టీజేఎస్, తెలంగాణ ఇంటి పార్టీ

ఉమ్మడి కార్యాచరణ ప్రకటించిన కోదండరాం, చెరుకు సుధాకర్‌

లక్డీకాపూల్‌: తెలంగాణ జనసమితి, తెలంగాణ ఇంటి పార్టీలు ఐక్యతా రాగాన్ని ఆలపించాయి. రాష్ట్ర ప్రజల సమస్యలపై ఉమ్మడి పోరాటాన్ని కొనసాగించేందుకు ఉమ్మడిగా పోరాడతామని ఆయా పార్టీ అధినేతలు ప్రొఫెసర్‌ కోదండరాం, డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ స్పష్టం చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఉమ్మడి కార్యాచరణను ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన, ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి లక్ష్యాల కోసం తాము కలిసి పోరాడనున్నట్లు వెల్లడించారు.

ఉద్యమకారులు, అట్టడుగు వర్గాలకు పాలన, నిర్ణయాధికారం ద్వారా అసమానతలు లేని తెలంగాణ దిశగా ఉద్యమించనున్నట్లు పేర్కొ న్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయం కలుషితమైపోయిందని, ఎన్నికల్లో డబ్బే ప్రధానాంశంగా మారిందని కోదండరాం అన్నారు. ఈ తరుణంలో ఐక్యంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ ఇంటి పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించామన్నారు. చెరుకు సుధాకర్‌ మాట్లాడుతూ.. తమకు భేషజాలు లేవని, ఎవరితోనైనా కలిసి పనిచేస్తామ న్నారు. ప్రజాపక్షంగా సమస్యల పరిష్కారా నికి నిర్మాణాత్మక పాత్రను పోషించనున్నట్లు తెలిపారు. ఇందుకు టీజేఎస్, ఇంటి పార్టీ కలిసి పనిచేయాలని నిర్ణయించామన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా