ముఖ్యమంత్రి మాట తప్పారు: గౌరు

2 Feb, 2018 14:40 IST|Sakshi
పాణ్యం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి(ఫైల్‌ ఫోటో)

కర్నూలు జిల్లా : కేసీ కెనాల్‌ రైతులకు 365 రోజులు నీళ్లు ఇస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట తప్పారని పాణ్యం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి విమర్శించారు. జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గౌరు చరిత విలేకరులతో మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారుల వైఖరి వల్ల కర్నూల్ జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోతోందన్నారు. శ్రీశైలంలో 858 అడుగుల నీటి నిల్వ ఉన్నప్పటికీ జిల్లా రైతులకు చుక్క నీరు అందడం లేదని మండిపడ్డారు.

 ముచ్చుమర్రి నుంచి కేసి కేనాల్‌కు  నీటిని నిలిపేయడం దారుణమని వ్యాఖ్యానించారు. తుంగభద్ర నుంచి నీటి వాటా సాధించడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని విమర్శించారు. శ్రీశైలం నిల్వ జలాల పంపిణీలో కర్నూల్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, కేసీ కెనాల్ కింద వేల ఎకరాల్లో పంట పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు